Latest Updates
-
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.!
వాంగీ బాత్ రెసిపి: కర్ణాటక స్టైల్ వంకాయ రైస్ చేయటం ఎలా ? వాంగీ బాత్ తయారీ
వాంగీ భాట్ లేదా వంగీ బాత్ ప్రపంచంలోనే అన్నిటికన్నా రుచికరమైన బియ్యపు వంటకం, ఇది మన చేతుల్లో పడటం నిజంగా చాలా అద్భుతం. పైగా ఈ సాంప్రదాయపు కర్ణాటక స్టైల్ వంకాయ రైస్ రెసిపి ఎంత సులభంగా చేయచ్చో మనకిప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే!
వంకాయ పోషకవిలువలకి,యాంటీఆక్సిడెంట్ లక్షణాలకి ప్రసిద్ధి, దీన్ని అన్నంతో కలపటం పొట్టకి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా రుచికరమైన పండగలాంటిది. ఇది ఒక ఆరోగ్యకరమైన కడుపునింపే మంచి బ్రేక్ ఫాస్ట్ వంటకం.
వాంగీ బాత్ లో ఈ రెసిపి కోసమే ప్రత్యేకంగా వాడే భారతీయ దినుసుల సువాసనలన్నీ దేనికవి అందంగా అమరిపోతాయి. వేయించిన సెనగపప్పు, మినపప్పు, అలాగే దినుసులైన లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, వాటితో మెంతులు, ధనియాల కలయిక అన్నీ కలిపి ఈ వంటకానికి మాటల్లో చెప్పలేని రుచిని అందిస్తాయి.
అన్నం మెత్తదనం, వంకాయల రుచి కలిసి ఈ రెసిపికి ప్రత్యేకమైన ఫ్లేవర్ కలిగించటంతో, అందరూ మెచ్చే మేటి బియ్యం వంటకాలలో ఇది ప్రసిద్ధి అనటంలో ఏ సందేహం లేదు.
ప్రాచీనకాలంలో మన ఇంటి కూరల్లో దాదాపు ప్రతిరోజూ వాడుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచీ వంకాయలు లేదా బైంగన్స్ మన సంస్కృతిలో భాగమైపోయాయి. మీకు నచ్చినా లేకున్నా దాని నుంచి దూరం అయితే పోలేరు, అయితే గియితే కాయగూరలు, అదీ వంకాయ కూర తినకుండా కంచం ముందునించి లేవనిచ్చే తల్లిదండ్రులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.
మీకు నచ్చినా లేకపోయిమ ఇటీవల పరిశోధనల్లో ఈ వంకాయలు లేదా ఎగ్ ప్లాంట్’స్ లో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉండి,మీ వయస్సు మీరకుండా చేసి, ఎక్కువ ముఖ్య పోషకాలన్నిటినీ అందిస్తాయి. అందుకే ఈ రెసిపి మీ ఇంట్లో ప్రయత్నించి ఎలా వస్తుందో చూడటానికి ఈ కారణాలు చాలు కదా!
కిందకి వెళ్ళి వీడియో సూచనలు,అలాగే బొమ్మలతో సూచనలు చదవండి. వచ్చే ఆదివారం భోజనంలో ఇదే మీ స్టార్ రెసిపి కావచ్చు. హాయిగా ఆనందించండి!

Recipe By: కావ్య
Recipe Type: అల్పాహారం
Serves: ఇద్దరికి
-
వంకాయలు 4-5
కొత్తిమీర - చేతిలో పట్టినన్ని
చింతపండు రసం -1 చెంచా
ధనియాలు -1 చెంచా
నూనె- అలంకరణకి + వేయించటానికి
ఎర్రమిర్చి (ఎండినది) -5-6
పొడి కొబ్బరి (తురిమినది) -1/2 కప్పు
బియ్యం -1 కప్పు
ఆవాలు - 1చెంచా
మినపప్పు-1 చెంచా
సెనగపప్పు -1 చెంచా
మసాలాదినుసులు (ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు) -1 చెంచా
బెల్లం - 1చెంచా
ఉప్పు - రుచికి
నువ్వులు -1చెంచా
మెంతులు -1 చెంచా
జీలకర్ర -1 చెంచా
కరివేపాకు -7-8
పసుపుపొడి - 1 చెంచా
-
1. ఒక బౌల్ తీసుకుని బియ్యం వేయండి.
2. నీళ్ళు పోసి బాగా కడగండి.
3. కుక్కర్ తీసుకుని ఆ బియ్యాన్ని అందులో వేయండి.
4. నీరు పోయండి.
5. 3 విజిల్స్ ఒచ్చాక కుక్కర్ ఆపండి.
6. అన్నాన్ని ఒక పక్కన పెట్టుకోండి.
7. వంకాయలు తీసుకుని సన్నగా ముక్కలు తరగండి.
8. అన్ని ముక్కలను ఒక బౌల్ నీళ్లలో వేయండి.
9. ఒక పెనం తీసుకోండి.
10. నూనె వేయండి.
11. మినప్పప్పు,జీలకర్ర, సెనగపప్పు, నువ్వులు, మెంతులు, లవంగాలు, ధనియాలను వేయండి.
12. అన్నిటినీ కలపండి.
13. ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి మళ్ళీ కలపండి.
14. కొబ్బరి మరియు ఇతర దినుసుల వాసన తెలిసేదాకా పొడిగా అన్నిటినీ వేయించండి.
15.3-4 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.
16.అన్ని దినుసులను మిక్సీలో వేయండి.
17. పొడి అయ్యేవరకూ మిక్సీ పట్టండి
18. పెనం తీసుకోండి.
19.నూనె, ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, పసుపు, వంకాయలు వేసి నిమిషంపాటు కలపండి.
20.చింతపండు రసం,బెల్లం వేసి బాగా కలపండి.
21. ఉప్పు వేయండి.
22. అన్నిటినీ కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి.
23. దినుసుల మిశ్రమాన్ని వేసి బాగా అన్నిటినీ కలపండి.
24. మూతపెట్టి 2-3 నిమిషాలను ఉడకనివ్వండి.
25. మూత తీసి వంకాయలను కలపండి.
26.అన్నం వేసి బాగా కలపండి
27. కొత్తిమీరతో అలంకరించి బౌల్ లోకి తీసుకోండి.
28.మీకు నచ్చిన పచ్చడి లేదా పెరుగుతో వడ్డించండి.
- 1.అన్నాన్ని ముందే వండుకొని వంకాయ మిశ్రమంతో కలిపేముందు కొన్ని గంటలు చల్లబడనివ్వండి.2.వంకాయలను కొద్దిసేపు నాననివ్వండి, అలా అయితే వండటానికి తక్కువ సమయం పడుతుంది.
- వడ్డించే పరిమాణం - 1 బౌల్
- క్యాలరీలు - 150
- కొవ్వు - 7గ్రాములు
- ప్రొటీన్ - 2 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 18 గ్రాములు
- ఫైబర్ - 2 గ్రాములు
స్టెప్ బై స్టెప్ – వాంగీ బాత్ ను ఎలా తయారుచేయాలి
1. ఒక బౌల్ తీసుకుని బియ్యం వేయండి.

2. నీళ్ళు పోసి బాగా కడగండి.



3. కుక్కర్ తీసుకుని ఆ బియ్యాన్ని అందులో వేయండి.


4. నీరు పోయండి.

5. 3 విజిల్స్ ఒచ్చాక కుక్కర్ ఆపండి.

6. అన్నాన్ని ఒక పక్కన పెట్టుకోండి.

7. వంకాయలు తీసుకుని సన్నగా ముక్కలు తరగండి.



8. అన్ని ముక్కలను ఒక బౌల్ నీళ్లలో వేయండి.

9. ఒక పెనం తీసుకోండి.

10. నూనె వేయండి.

11. మినప్పప్పు,జీలకర్ర, సెనగపప్పు, నువ్వులు, మెంతులు, లవంగాలు, ధనియాలను వేయండి.







12. అన్నిటినీ కలపండి.

13. ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి మళ్ళీ కలపండి.


14. కొబ్బరి మరియు ఇతర దినుసుల వాసన తెలిసేదాకా పొడిగా అన్నిటినీ వేయించండి.

15.3-4 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.

16.అన్ని దినుసులను మిక్సీలో వేయండి.

17. పొడి అయ్యేవరకూ మిక్సీ పట్టండి

18. పెనం తీసుకోండి.

19.నూనె, ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, పసుపు, వంకాయలు వేసి నిమిషంపాటు కలపండి.








20.చింతపండు రసం,బెల్లం వేసి బాగా కలపండి.








25. మూత తీసి వంకాయలను కలపండి.


26.అన్నం వేసి బాగా కలపండి


27. కొత్తిమీరతో అలంకరించి బౌల్ లోకి తీసుకోండి.

28.మీకు నచ్చిన పచ్చడి లేదా పెరుగుతో వడ్డించండి.





Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
