Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
వసంత పంచమి స్పెషల్.. అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు స్వీట్ బూందీ..ఇలా చేస్తే కేక టేస్ట్!
జ్ఞానానికి, కళలకు అధిదేవత అయిన సరస్వతి దేవిని ఆరాధించే అత్యంత పవిత్రమైన పండుగ వసంత పంచమి. చలికాలం ముగిసి, ప్రకృతి కొత్త చిగురులతో కళకళలాడే వసంత రుతువు ఆగమనానికి సూచిక ఈ పండుగ. 2026 సంవత్సరంలో, జనవరి 23, శుక్రవారం నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. ఈ శుభదినాన అమ్మవారికి స్వచ్ఛమైన ఇంటి నైవేద్యం సమర్పించడం ఎంతో శ్రేయస్కరం.
హిందూ సంప్రదాయం ప్రకారం వసంత పంచమి రోజున పసుపు రంగుకు అత్యంత
ప్రాముఖ్యత ఉంది. పసుపు రంగు బృహస్పతి గ్రహానికి ప్రతీక. ఇది జ్ఞానం,
విద్య, శ్రేయస్సుకు చిహ్నం. అందుకే ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు
దుస్తులు, పూలు, ముఖ్యంగా పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా
సమర్పిస్తారు. ఇది విద్యార్థులకు జ్ఞానాన్ని, సన్యాసులకు ప్రశాంతతను
ప్రసాదిస్తుందని నమ్మకం.
ఈసారి పండుగకు బయట స్వీట్ షాపుల్లో కొన్నవి కాకుండా, ఇంట్లోనే పరిశుభ్రంగా, స్వీట్ షాపులో దొరికేలా మెత్తగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా స్వీట్ బూందీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
శనగపిండి: 1 కప్పు
చక్కెర: 1 కప్పు
ఏలకుల పొడి: అర టీస్పూన్
కుంకుమపువ్వు రేకులు: 10
ఫుడ్ కలర్: చిటికెడు పసుపు రంగు
నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిపడా
నీళ్లు: తగినన్ని
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు శనగపిండిని తీసుకోండి. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. దోశ పిండి కంటే కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది.
-కలిపిన పిండిలో చిటికెడు పసుపు రంగు వేసి, పిండిని బాగా బీట్ చేయాలి. పిండిని ఎంత బాగా కలిపితే బూందీ అంత గుండ్రంగా, ముత్యాల్లా వస్తాయి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి లేదా నూనె పోసి వేడి చేయండి. నూనె కాగిందో లేదో చూడడానికి ఒక చుక్క పిండి వేయండి. అది వెంటనే పైకి తేలితే నూనె సిద్ధంగా ఉన్నట్లే.
-ఇప్పుడు బూందీ గరిటె లేదా చిల్లుల గరిటెను నూనె పైన పట్టుకుని, పిండిని దానిపై పోసి మెల్లగా తట్టండి. చిన్న చిన్న ముత్యాల్లాంటి బూందీ నూనెలో పడతాయి. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-మరో గిన్నెలో ఒక కప్పు చక్కెర, అది మునిగేంత వరకు నీళ్లు పోసి మరిగించండి. పాకం మరీ తీగ పాకం రానవసరం లేదు, గులాబ్ జామ్ పాకంలా కాస్త చిక్కబడితే చాలు. ఇందులో యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
-ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని, వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి కనీసం 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఈ సమయంలో బూందీ పాకాన్ని పూర్తిగా పీల్చుకుని, మెత్తగా, జ్యూసీగా తయారవుతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, జ్యూసీగా ఉండే ఎల్లో స్వీట్ బూందీ ప్రసాదం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







