Latest Updates
-
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే!
దాల్ కోకనట్ కర్రీ రిసిపి: బెస్ట్ రోటీ అండ్ రైస్ కాంబినేషన్
చెన్నా దాల్ చాలా ట్రెడిషినల్ వంట. ఈ దాల్ రిసిపిని ఒక్కక్కరు ఒక్కో విధంగా తయారుచేస్తారు. అయితే బెంగాళీయులు తయారుచేసే చెన్నా దాల్ రిసిపి చాలా టేస్టీగా డిఫరెంట్ గా ఉంటుంది. బెంగాళ్ దాల్ రిసిపి చాలా పాపులర్. అలాగే కేరళ దాల్ చెన్నా రిసిపి, పచ్చికొబ్బరి తురుముతో తయారుచేస్తారు.
చెన్నాదాల్ రిసిపిని పప్పును ఎక్కువగా(మరీ మెత్తగా) ఉడకించకుండా ఉంటేనే రుచికరంగా ఉంటుంది. లేదంటే పప్పు నున్నగా ఉడికించడం వల్ల కరిగినట్లు అయిపోతుంది, దాంతో దాల్ కర్రీ అంత టేస్టీ గా అనిపించదు. కాబట్టి, ఒక మోస్తరుగా పప్పును ఉడికించుకొని తర్వత ఇతర మసాల మరియు పోపుదినుసులు జోడించి తయారుచేసుకోవాలి. మరి ఈ చెన్నా దాల్ కోకనట్ కర్రీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పచ్చిశెనగపప్పు: 2cups(రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి)
ఎండు మిర్చి :2
బే ఆకు(బిర్యానీ ఆకు): 1
జీలకర్ర: 1tsp
కొబ్బరి తురుము: ½cup
జీలకర్ర పొడి : 1tsp
పసుపు పొడి: ½tsp
టమోటో: 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
గరం మసాలా: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
పంచదార: కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కలర్ లో రాత్రి నానబెట్టుకొన్న శెనగపప్పును వేసి శుభ్రంగా కడిగి, తర్వాత అందులో 4కప్పులు నీరు పోసి, మీడియం మంట మీద 3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో ఎండు మిర్చి, బిర్యానీ ఆకు మరియు జీలకర్ర వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే జీలకర్ర పొడి కూడా వేసి మరో నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత కొబ్బరి తురుము వేసి, తక్కువ మంటలో 2-3నిముషాలు వేగించుకోవాలి.
5. అలాగే టమోటో ముక్కలు కూడా వేసి మరో 5 నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
6. ఇలా మొత్తం మిశ్రమం క్రమంగా వేగిన తర్వాత ముందుగా కుక్కర్ లో ఉడికించుకొన్న దాల్ ను అందులో వేయాలి. మిక్స్ చేస్తూ గరం మసాలా మరియు పంచదార కూడా వేసి మిక్స్ చేసి మరో 5నిముషాలు సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. అందే దాల్ కోకనట్ కర్రీ రెడీ . ఇది రోటీ మరియు రైస్ కు చాలా మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications











