Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
గుమ్మడి ఘుమఘుమలు గుమ్మడి - శనగల కుర్మా

గుమ్మడితో చేసిన వంటకాలు తినండి...కడుపులో కూడా దిష్టి పోయి హాయిగా ఉంటుంది. ఇంటికీ, ఒంటికీ మంచి చేసే గుమ్మడి ఎప్పుడు వండుకుంటే అప్పుడే పండగ! గుమ్మడికాయ లాంటి మీ ‘ఫ్యామిలీ' కోసం ఈ రోజు ఘుమ్మడి ట్రీట్ తో ఎంజాయ్ చేయండి!!
కావలసిన పదార్థాలు:
పెద్ద శనగలు: 1small cup
మీల్ మేకర్:1cup
దాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు: 2tsp
పచ్చికొబ్బరి తురుము: 3tbsp
నూనె : 5tsp
పోపు దినుసులు: 2tsp
పసుపు : చిటికెడు
టొమాటో ప్యూరీ: 1/2 cup
గుమ్మడిముక్కలు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
కారం: తగినంత
గరం మసాలా: 2tsp
పల్లీ, నువ్వులపొడి: 3tsp
పచ్చిమిర్చి తరుగు: 2tsp
కొత్తిమీర, మెంతి తరుగు: 4tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పెద్దశనగలు ఉడికించి పక్కనుంచాలి.
2. తర్వాత మీల్ మేకర్లో వేడి నీరుపోసి పక్కనుంచాలి.
3. ఇప్పుడు దాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు, పచ్చికొబ్బరి తురుము (సగం మాత్రమే) వీటన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ లో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి.
4. తరవాత అందులోనే పసుపు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక, గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన శనగలు, వేడినీటి నుంచి తీసిన మీల్మేకర్‌లను ఇందులో వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
5. బాగాఉడికిన తరవాత ఉప్పు, కారం, గరం మసాలా, పల్లీపొడి, నువ్వులపొడి, పచ్చిమిర్చి తరుగు వేసి మరి కాస్త మగ్గినతరువాత ముందుగా తయారుచేసుకున్న కొబ్బరిపేస్ట్, కొద్దిగా నీరు పోసి మూత పెట్టాలి. కూర గ్రేవాలా తయారైన తరవాత మూత తీసి మిగిలిన కొబ్బరి తురుము కూడా వేసి కాసేపు ఉంచి స్టవ్ మీద నుంచి దించి కొత్తిమీర, మెంతికూరలతో గార్నిష్ చేయాలి. అంతే గుమ్మడి శెనగల కుర్మా రెడీ..



Click it and Unblock the Notifications











