Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
కర్నాటక స్పెషల్ చౌ చౌ బాత్

ఉప్మారవ్వ - 1/2 kg
ఎండు కొబ్బరి - 10 grm
కొత్తిమిర - చిన్న కట్ట
పచ్చిమిర్చి - 5
ఉల్లిపాయలు - 2
నిమ్మరసం - 1 tsp
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంగ
పోపుదినుసులు -1 tsp (ఆవాలు, మినుములు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, లవంగాలు, దాల్చిన చెక్క)
కేసరి బాత్ కోసం
ఉప్మారవ్వ - 1/2 kg
నెయ్యి - 4 tbsp
కొబ్బరి - చిన్న చెక్క
పంచదార -150 grms
డ్రైఫ్రూట్స్ - జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష,
ఉప్మా తయారి:
స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకుని పోపుదినుసులన్నీ వేసుకోవాలి. అందులోనే పసుపు, తరిగిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిరిప, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరిపోడి వేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించాలి. కమ్మని వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి మరుగుతున్న నీటిని పోసి ఉండ కట్టకుండా కలిపి దించేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
చౌచౌ బాత్ తయారికి చేసుకునే ఉప్మా పోడిగా ఉండకూడదు కొంచెం ముద్దగా ఉండాలి.
కేసరిబాత్ తయారిచేయు విధానం:
పాన్ లో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత పచ్చికొబ్బరి తురుము, రవ్వ వేసి దోరగా వేయించాలి. దానిలోనే పంచదార వేసి రెండు నిమిషాల సేపు మంట తగ్గించి మూగ పెట్టాలి. పంచదార కరిగిన తర్వాత వేడి నీటిని పోసి ఏలకుల పొడి, జీడిపప్పు వగైరా పప్పులు వేసుకుని కలుపుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత మంట ఆపేసి మూతపెట్టాలి. సో సర్వ్ చేసేటప్పుడు ఒకే ప్లేట్ లో ఉప్మా పక్కనే ఒక కప్పు కేసరి బాత్ పెట్టి వడ్డించాలి.



Click it and Unblock the Notifications











