Latest Updates
-
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!
మష్రుమ్ - కార్న్-కాజు మసాలా కర్రీ
సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మంది మష్రుమ్(పుట్టగొడుల)రుచి, వాసన పట్టదు. అటువంటి వారు ఈ మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, వెంటనే తినడం ప్రారంభించేస్తారు. అన్ని గొప్ప ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయి.
మష్రుమ్ క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు మన శరీరం యొక్క వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరి మీరు కూడా మష్రుమ్ టేస్ట్ చేయాలన్నా, లేదా మీ ఇంటికి వచ్చిన అథితులకు ఒక కొత్త రుచి చూపించాలన్నా మష్రుమ్ కర్రీనీ ట్రై చేయండి. ఈ సింపుల్ రిసిపి మష్రుమ్ కార్న్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Serves: 3
Preparation Time: 20 minutes
Cooking Time: 15 minutes

కావల్సిన పదార్థాలు:
మష్రుమ్: 3cup(మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
కార్న్(మొక్కజొన్నవిత్తనాలు): 1cup
జీడిపప్పు: 1/4cup
టమోటో: 2cup(సన్నగా తరిగినవి)
అల్లం: 1tsp(సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 1(సన్నగా తరిగినవి)
నూనె: 2tbsp
జీలకర్ర: 1/2tsp
ఇంగువ: చిటికెడు
పసుపు: 1/4tsp
కారం: 1/4tsp
ధనియాల పొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు : 1cup(సన్నగా తరిగినది)
నీళ్ళు : 1cup

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ లో టమోటో, జీడిపప్పు, అల్లం, మరియు పచ్చిమిర్చి వేసి ఒక నిముషం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత సాస్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి.
3. ఇప్పుడు అందులో చిటికెడు, ఇంగువ మరియు జీలకర్ర వేసి మరియు మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే ధనియాల పొడి, కారం, పసుపు, మరియు ఉప్పు కూడా మొత్తం మిశ్రమం మిక్స్ చేస్తూ మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇలా మొత్తం మసాలా వేగించుకొన్న తర్వాత అందులో కార్న్ మరియు మష్రుమ్ వేసి మొత్తం మిశ్రామన్ని కలగలిపి సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.





న్యూట్రిషయిన్ చిట్కా
ఈ వంటకు కార్న్ జోడించడంవల్ల ఇందులో విటమిన్ డి మరియు ఎ పుష్కలంగా ఉండి మనశరీరానికి అందిస్తుంది. అలాగే మష్రుమ్స్ కూడా, ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
చిట్కా: కార్న్ మరియు మష్రుమ్ రెండూ మెత్తగా ఉడికేలోపు, గ్రేవీ చిక్కబడాలి.



Click it and Unblock the Notifications











