Latest Updates
-
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి!
నోరూరించే వంటకం...జీర్ణమవటం తేలిక!

పచ్చి బఠాణీ మరియు జీడిపప్పు కూర్మా (భారతీయ వంటకంగా)
అవసరమైన పదార్ధాలు
జీడిపప్పులు - 1 కప్
నూనె...కొద్దిగా
దాల్చిన చెక్క - 1 అంగుళం
యాలకులు పొడి కొద్దిగా
లవంగాలు - 2 లేదా 3
జీలకర్ర - 1 టీ స్పూన్
ఉల్లిపాయలు, తరిగినవి - రెండు లేదా 3 నెం.లు
పచ్చి బఠాణీ లేదా గ్రీన్ పీస్, ఉడికించినవి - - అర కె.జి.
పచ్చి మిరపకాయలు తరిగినవి - 2 లేదా 3 ముక్కలు
టమాటా ముక్కలు, లేదా గుజ్జు - 3 టీ స్పూన్లు
పసుపు పొడి - అర స్పూను
ఎండు మిర్చి పొడి - 1 టీ స్పూన్
ధనియా పొడి - 1 టీ స్పూన్
జీలకర్ర - 1 టీ స్పూన్
ఆమ్ చూర్ - 1 టీ స్పూన్
గరం మసాలా - 1 టీ స్పూన్
ఉప్పు ....కొద్దిగా రుచికి
కూర వండే విధానం ఎలా?
ఒక నాన్ స్టిక్ పాన్ లో రెండు లేదా మూడు చుక్కల నూనె వేడి చేయండి. దానిలో జీడిపప్పు తక్కువ మంటపై బాగా వేయించండి. వేయించిన జీడిపప్పును ఒక టిష్యూ పేపర్ పై వుంచి పక్కన పెట్టండి.
అదే పాన్ కు 1 టీ స్పూన్ నూనె వేయండి. ఇపుడు లవంగాలు, యాలకులు, చెక్క వంటివి వేసి బాగా వేయించండి. దానికి జీలకర్ర కలపండి. అవి రంగు మారే వరకు వేయించండి.
ఇపుడు తరిగిన ఉల్లిపాయలు వీటికి కలపండి. తక్కువ మంటలోనే మెత్తపడేంతవరకు వుంచండి. దీనికి పచ్చి మిరపకాయలు, టమాట కూడా కలపండి. నూనె తగ్గేంతవరకు వుంచండి.
దీనికి బఠాణీలు, పసుపు, ఎర్ర మిర్చి, ధనియాలు, మెంతులు, గరం మసాలాలు కలపండి. తక్కువ మంటపైనే కొద్దినిమిషాలుంచండి, ఆమసాలాల వాసన అంతా బయటకు వస్తుంది.
ఇక ఈ మిశ్రమానికి ఆమ్ చ్చూర్, వేయించినజీడి పప్పులు కలిపి మెల్లగా తిప్పండి. ఇక పొయ్యి మంట తీసేయండి. మీరు మెచ్చే పచ్చిబఠాణీలు, జీడిపప్పు కూర్మా తయార్...! దీనిపై కొద్దిగా కొత్తిమీర చల్లండి. వేడిగా మీ కిష్టమైన వారికి అన్నం లేదాపరోటాలు, లేదా చపాతీలు వంటి వాటిలో పక్కన పెట్టి తినిపించేయండి. మీరు పొడి కరూర చేయాలనుకుంటే, టమాటా పూరీ తగ్గించండి. గ్రేవీగా చేయాలననుకుంటే టమాటా పూరీ అధికం చేస్తూ తగిననీటిని కలపండి. టమాటా రుచి మాత్రం బాగానే వుండేలా చూడండి.



Click it and Unblock the Notifications











