Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
రాజ్మా(కిడ్నీ బీన్స్)పులావ్ రిసిపి
కాశ్మిర్ రాజ్మా మసాలా. మంచి రుచికరమైన రిసిపి. రాజ్మాలో రెండు రకాలు మనకు మార్కెట్లో లభ్యం అవుతాయి. ఒకటి తెల్లగా ఉండే రాజ్మా(కిడ్నీ బీన్స్)పంజాబ్ లో ఎక్కువగా పండిస్తారు. ఇక రెండవది రెడ్ రాజ్మా వీటిని కాశ్మిర్ లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఈ రెడ్ రాజ్మాను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటితో తయారుచేసే కర్రీస్ కు ఎక్కువ క్రేజ్. కర్రీలు మాత్రమే కాకుండా రాజ్మాతో బిర్యానీ మరియు పులావ్ ను కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మరి ఈ రోజు మనం రాజ్మా పులావ్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం....
ఇండియన్ కుషన్స్ లో రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ చాలా పాపులరైనటువంటి సైడ్ డిష్. ముఖ్యంగా రాజ్మా వంటలను నార్త్ స్టేట్స్ లో ఎక్కువుగా తయారుచేస్తారు. వీటిని బీన్స్ గా పిలుచుకొనే సౌత్ స్టేట్స్ లో కూడా వీటిని ఎక్కువగా వండుతారు. రాజ్మా పొట్టనిండినట్టు చేస్తే ఒక రిచ్ ఫుడ్ . వీటిని ఎక్కువగా రాత్రుల్లో డిన్నర్ కు ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. అలాగే రోజంతా హెల్తీగా ఉండేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కూడా తీసుకుంటారు. మరీ ఈ రాజ్మాను హెల్తీ డిన్నర్ రిసిగా ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్ధాలు:
రాజ్మా (కిడ్నీ బీన్స్): 1cup
బియ్యం : 2glasses
ఉల్లిపాయలు : 2(పెద్దవి/సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి : 6(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం,వెల్లుల్లి ఫేస్ట్ : 1tsp
కారం : 1tsp
పసుపు : 1/2tsp
ధనియాలపొడి : 1tsp
గరంమసాలా : 1tsp
టమోటాలు : 2(మీడియం సైజ్/సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర: ఒక కట్ట
పుదీనా : ఒక కప్పు
నెయ్యి : 4tsp
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేయు విధానం :
1. ముందుగా రాజ్మా గింజలను అయిదు గంటలసేపు నానబెట్టుకోవాలి.
2. తర్వాత వీటిలోని నీరు వంపేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి, కాస్త ఉప్పు వేసి ఉడుకించుకోవాలి.
3. అంతలోపు బియ్యాన్ని కూడా కడిగి ఉంచుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో గరంమసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
5. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాలపొడి, పుదీనా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేయాలి.
6. ఇప్పుడు టమోటో ముక్కలు, ఉడికించుకున్న రాజ్మా వేసి కలబెట్టి మరో అయిదు నిమిషాలు స్టౌ మీద ఉంచితే కూర తయారవుతుంది.
7. ఒక పాత్రలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మరగబెట్టి పొంగుతున్న సమయంలో నానబెట్టిన బియ్యాన్ని వేసి తగినంత ఉప్పు కలిపి మూత పెట్టాలి.
8. మూడు వంతులు ఉడికిన తర్వాత అన్నాన్ని దించేసుకోవాలి. ఓ గిన్నెలో సగం అన్నాన్ని ఓ పొరలా వేయాలి. తర్వాత రాజ్మా కూరను వేయాలి. తర్వాత మరలా మిగిలిన అన్నాన్ని వేసి స్టౌ మీద పెట్టి అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దించుకోవాలి. చివరగా కొత్తిమీరను గార్నిష్ గా అలంకరించి క్రింది దింపుకొని క్యారెట్ రైతా లేదా కీరదోసకాయ రైతాతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











