Latest Updates
-
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి!
కూటు కర్రీ రిసిపి: మలబార్ స్టైల్
కూటు కర్రీ కేరళీయులకు ఇష్టమైన ఇక ట్రెడిషనల్ రిసిపి. ముఖ్యంగా ఇంటువంటి వంటలను ఓనమ్ పండుగ స్పెషల్ గా తయారుచేసుకుంటారు.
ఈ ట్రెడిషనల్ మలబార్ స్టైల్ కూటు కర్రీ కొంచెం కారంగా ఉంటుంది. అంతే కాదు, ఈ కూటు వంటకంలో వివిధ రకాల వెజిటేబుల్స్ ను వేయడం వల్ల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని మలబార్ స్టైల్లో తయారుచేసుకుంటారు . ఈ కర్రీని సైడ్ డిష్ గా లేదా మెయిన్ డిష్ గా సర్వ్ చేస్తారు. అలాగే నెయ్యి, పప్పాడ్ తో వడ్డించడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఈ స్పెషల్ మలబార్ స్టైల్ కూటు కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం. ..

కావల్సిన పదార్థాలు:
బ్లాక్ లేదా బ్రౌన్ శెనగలు: 1 cup(ఉడికించుకోవాలి)
పచ్చిఅరటికాయ: 1 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
యామ్: 1 cup(సన్నగా కట్ చేయాలి)
క్యారెట్, గుమ్మడి, కీరదోసకాయ మరియు బంగాళదుంప: 2 cups(ఉడికించినవి)
పసుపు: 1/2 tsp
కారం: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
మసాలా కోసం:
కొబ్బరి తురుము: 1 cup
ఎండుమిర్చి: 2-3
జీలకర్ర: 1 tsp
గార్నిషింగ్ కోసం :
ఉద్దిపప్పు: 1tsp
ఆవాలు: 1tsp
డ్రై కొబ్బరి: కొద్దిగా(సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా పొడి చేసుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
కొబ్బరి నూనె: అవసరం అయినంత
కూటు తయారుచేయు విధానం:
1. ముందుగా మసాలాకు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఫ్రైయింగ్ పాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడిచేసుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో అన్ని కూరగాయ ముక్కలు మరియు పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
3. తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి అందులో గ్రైండ్ చేసిన మసాలాపౌడర్ వేసి 10-15 నిముషాలు, మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
4. చివరగా వేరొక పాన్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి అందులో ఆవాలు, ఉద్దిపప్పు, కొబ్బరి తురుము మరియు కరివేపాకు వేసి ఫ్రై చేసి కుక్కర్ లో ఉడికించుకొన్న కూటును అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే కేరళా స్టైల్ కూట్ కర్రీ రెడీ.



Click it and Unblock the Notifications











