పాలకూర-మీల్ మేకర్ కర్రీ

Palak-Mealmaker Curry
కావలసిన పదార్థాలు:
పాలకూర : 2cups
మీల్ మేకర్ కీమా :1/2cup
ఉల్లిపాయ : 1
పసుపు : 1/4 tsp
కారం పొడి : 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
గరం మసాలా పొడి :1/2 tsp
కరివేపాకు :2 రెబ్బలు
అల్లంవెల్లుల్లి ముద్ద :1 tsp
నెయ్యి :1 tsp
నూనె :3 tbsp

తయారు చేయు విధానం:
1. మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి పది నిమిషాలు ఉంచాలి. తర్వాత నీరంతా పిండేసి పాన్ లో నెయ్యి వేడి చేసి కొద్దిగా వేయించాలి. 2. దీనివల్ల మీల్ మేకర్ కు మంచి వాసన వస్తుంది. పాలకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించాలి.
4. ఇప్పుడు పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి తరిగిన పాలకూర, ఉప్పు, కారం పొడి వేసి కలిపి మూతపెట్టాలి.
5. చిన్నమంట మీద పాలకూర మొత్తం ఉడికేవరకు ఉంచి వేయించుకున్న మీల్ మేకర్, గరం మసాలా పొడి వేసి బాగా కలియబెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. అంతే పాలక్ మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ కూర అన్నం, రొట్టెలలోకి చాలా బావుంటుంది.

Story first published: Thursday, March 3, 2011, 14:24 [IST]
Desktop Bottom Promotion