Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
పాలకూర కూటు

పాలకూర: 2కట్టలు
కందిపప్పు: 100grm
పెసర పప్పు: 100grm
పల్లీలు: 50grm
ఎండుమిర్చి: 6
శనగపప్పు: 2tsp
మినపప్పు: 2tsp
ధనియాలు: 1tsp
పసుపు: చిటికెడు
ఎండు కొబ్బరిపొడి: 2tsp
తెల్లనువ్వులు: 2tsp
పాలు: 1/2glass
పంచదార: 1tsp
మిరియాలు: 10
జీలకర్ర: 1tsp
పోపుకోసం: నూనె, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమిర తగినన్ని
తయారు చేయు విధానము:
1. పాన్ లో నూనె లేకుండా శనగపప్పు, ధనియాలు, మినపప్పు, ఎండుకొబ్బరి తురుము, ఎండుమిర్చి, నువ్వులను దోరగా వేయించి పక్కనుంచుకోవాలి. చల్లారిన తర్వాత అందులో మిరియాలు, జీలకర్ర, ఇంగువ వేసి మిక్సీ లో వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడ కుక్కర్ లో కందిపప్పు, పెసర పప్పు, పాలకూర తరుగు, పల్లీలు, పసుపు, తగినింత నీరు పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచి దింపేయాలి.
3. కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి అందులో పొడి చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి.
4. తర్వాత పాలు, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి.
5. స్టౌ మీద పాన్ పెట్టి అందులో కావలసినంత నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి దోరగ వేయింది దానిని కూటులో వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే పాలకూర కూటు రెడీ. ఇది ఇడ్లీ, దోసె, చపాతీ అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











