Latest Updates
-
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే!
టేస్టీ పొటాటో పాన్ కేక్స్

తురిమిన ఆలు : 2cups
తురిమిన ఉల్లిపాయ: 1/2cup
మైదా : 1cup
మిరియాలపొడి: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tsp
బేకింగ్ పౌడర్: 1/2tsp
బేకింగ్ సోడా: చిటికెడ్
తయారు చేయు విధానం:
1. ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి. ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు.
2. తర్వాత మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలను కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో కలిపి పెట్టుకున్న ఆలు, ఉల్లి తురుమును కలిపి అందులో జారుగా వచ్చేలా తగినన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవాలి. (గరిట జారుగా కలుపుకున్న పిండిని ఎక్కువగా కలపకుండా ఉంటేనే మంచిది).
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి పాన్ అంతటికి నూనె అంటేలా గరిటతో తిప్పాలి.
5. తర్వాత ఒక కపెద్ద గరిటెడు పిండిని తీసుకుని దోశలకు పోసినట్టుగా పోయాలి. అయితే ఇది పల్చగా మాత్రం ఉండకూడదు. ఎంత పెద్దది, ఎంత చిన్నది వేయాలనేది మన ఇష్టం. రెండు నిమిషాలపాటు దానిని ఉడకనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా అలాగే కాలే దాకా ఉంచాలి. దీనిని టమేటో కెచప్‌తో కానీ జామ్ తో కానీ చట్నీతో కానీ దేనితోనైనా తినవచ్చు. కొబ్బరి చట్నీ అయితే మరీ మహాటేస్టీగా ఉంటుంది సుమా...



Click it and Unblock the Notifications











