Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
క్విక్ అండ్ సింపుల్ దాల్ ఫ్రై రిసిపి
దాల్ రిసిపి, మన ఇండియాలో అందరికీ ఒక ఇష్టమైన వంట. ప్రధానంగా తీసుకొనే మధ్యాహ్నాన భోజనంలో పప్పు లేకుండా, ఆ భోజనం పూర్తి కాదు. అంతే కాదు, చపాతీ మరియు రోటీలకు కాంబినేషన్ ఫుడ్స్ అంత ఎక్కువగా ఉండవు.కానీ, ఈ దాల్ రిసిపి చాలా రుచికిరమైన వంట.

కాబట్టి, ప్రతి రోజూ మనం తీసుకొనే రెగ్యులర్ డైట్ లో ఒక ముఖ్యమైనటువంటి వంట, దీన్ని వివిధ రకాలుగా తయారుచేసుకోవచ్చు . కానీ, అన్నింటిలోకంటే, దాల్ ఫ్రై రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది. మరి ఈ స్పెషల్ దాల్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1/2cup
శెనగపప్పు: 1/2 cup
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగినవి)

టమోటోలు: 2 (సన్నగా తరిగినవి)
నెయ్యి: 4tbsp
పసుపు: 1tsp
కారం: 1tsp

కొత్తిమీర తరుగు: 3tbsp
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర: 1/2 tsp
దాల్చిన చెక్క: 1 stick

లవంగాలు: 2
ఇంగువ: 1/4tsp
వెల్లుల్లి రెబ్బలు: 7(సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
ఎండుమిర్చి: 1

తయారుచేయు విధానం:
1. ముందుగా కందిపప్పును ప్రెజర్ కుక్కర్ లో వేసి, కొద్దిగా ఉప్పు సరిపడా నీళ్ళు పోసి 3, 4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకవాలి. ఉడికించుకొన్న తర్వాత పప్పును స్పూన్ తో మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

3. ఇప్పుడు అందులో ఉల్లిపాయల ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత టమోటో ముక్కలు కూడావేసి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసి 5నిముషాలు, మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
5. తర్వాత ముందుగా ఉడికించుకొన్న పప్పు వేసి బాగా మిక్స్ చేసి తిరిగి ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసి మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి.

7. ఉడికిన తర్వాత ఈ పప్పు రిసిపిని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి.
8. ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తర్వాత, ఎండు మిర్చి, ఇంగువ, వెల్లుల్లిరెబ్బలు, వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఈ పోపును పప్పులో పోసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. దాల్ ఫ్రై రెడీ. దీన్ని రైస్ మరియు రోటీతో సర్వ్ చేయాలి.

న్యూట్రీషియన్ వాల్యూ: ఈ వంటకు వెజిటేబుల్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటుంది. ఈ నూనెను ఉపయోగించినప్పుడు, రెండు శాతం ఫ్యాట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఇందులో మంచి ప్రోటీన్లు కలిగి ఉంటాయి.



Click it and Unblock the Notifications











