For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెరైటీ రుచి... రవ్వ వాంగీబాత్

|

Rava Vangibath
అల్పాహార రుచులల్లో ఇదొక వెరైటీ రుచి. ఇది సాధరణంగా, రెగ్యులర్ గా చేసుకొనే వంటకం కాదు. వాంగీబాత్ సాధారణంగా రైస్ తో తాయారు చేసుకొంటాం. అయితే కొంచెం వెరైటీగా రవ్వతో చేసుకొంటే మరో కొత్త రుచిని ఆస్వాదించవచ్చు. ఈ అల్పాహారంలో క్యాలరీలు తక్కువే.

కావలసిన పదార్థాలు:
చిరోటి రవ్వ: 1cups
వాంగిబాత్ పౌడర్: 3tsp
వంకాయలు: 4
పోటాటో: 2( చిన్నవి)
టోమాటోస్: 3
గ్రీన్ చిల్లీ : 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తమిర తురుము: 1tbsp
అన్నీ కలిపిన పోపుగింజలు: 1tbsp(ఉద్దిపప్పు, శెనగపప్పు, ఆవాలు,)
పచ్చికొబ్బరి: 1/4cup
వేయించిన జీడిపప్పు ముక్కలు: 15-20
నీళ్ళు : 2cups
ఉప్పు : రుచికి తగినంత
నెయ్యి : 2tbsp
నూనె : సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి, చిరోటి రవ్వను కూడా వేసి దోరగా వేయించుకోవాలి.
2. తర్వాత వంకాయలు, పోటాటో(బంగాళదుంప), మీకు కావలసిన షేపులో కట్ చెసి నీళ్ళల్లో ఉప్పువేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పచ్చిమిర్చి, టమోటో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి నూనె కాగాక అందులో పోపుగింజలు కరివేపాకు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత అందులో పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత తరిగిన వంకాయలు, పోటాటో, టోమాటో లు వేసి బాగా వేయించుకోవాలి. నూనెలో అవికాస్త వుడికాక వాటిపై వాంగిబాత్ పౌడర్ వేసి బాగా కలయబెట్టి నీళ్ళు పోసి ఉప్పువేసి నీళ్ళు బాగా మరిగే వరకు వుంచి అందులో చిరోటి రవ్వ వేసి బాగా కలపాలి.
5. రవ్వ వుండలు కట్టకుండా కొద్ది సేపటి వరకూ కలుపుతూనే ఉండాలి. రవ్వ గట్టిగా పొడిపోడిగా మృదువుగా రావాలి అందులోకి మిగిలిన నెయ్యి, కొత్తమిర, జీడిపప్పు, వేసి సర్వ్ చేయడమే. అంతే ఘుమఘుమలాడే రవ వాంగీబాత్ రెడీ.

వాంగిబాత్ పౌడర్ కోసం:
కావలసిన పదార్థాలు:

పచ్చిశెనగపప్పు : 1cup
మినపప్పు : 1cup
ధనియ: 3/4cup
డ్రై చిల్లీ : 25grm (కారం తగినంత)
లవంగాలు: 4
చెక్క: చిన్న ముక్క
ఎండు కొబ్బరి : 1/2cup
జీడిపప్పువేయించినవి : 4

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసి అందులో విడి విడిగా అన్నీ దోరగా వేయించుకోవాలి. కొబ్బరి కొద్దిగా వేడి చేస్తే చాలు. మిగిలినవన్నీదోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి అన్నీ గ్రైండర్లో మెత్తగా పౌడర్ చేసుకొని పక్కనపెట్టుకోవాలి.

English summary

Rava Vangibath Recipe | లో క్యాలరీ వాంగీబాత్...!

Rava Vangibath is not as popular as our regular Vangibath (made with rice) though it is one of those traditional dishes of karnataka which is quite common among few kanndiga homes.
Story first published:Thursday, July 19, 2012, 13:21 [IST]
Desktop Bottom Promotion