For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రవ్వ కిచిడి-స్పెషల్ లంచ్ రిసిపి

|

మన మద్యహ్నానం భోజనం విషయంలో మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యకరమైనది అదే విధంగా పొట్ట నింపేదిగా ఉండాలి. అటువంటి ఆహారాల్లో ఒకటి రవ్వ కిచిడి. ఈ కిచిడిని రవ్వ మరియు హెల్తీ వెజిటేబుల్స్ తో తయారుచేస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే వెజిటేబుల్స్ తో తయారుచేసే ఈ వంటను మనం మద్యహ్నాం భోజనంలో తప్పకుండా తీసుకోవచ్చు.

రవ్వ కిచిడిలో వెజిటేబుల్స్ తో పాటు జీడిపప్పు నెయ్యి వంటివి చేర్చడం వల్ల ఒక అద్భుతమైన రుచితో పాటు, మంచి ఫ్లేవర్ మరియు ఆరోగ్యాన్ని అంధిస్తుంది. ఈ రవ్వ కిచిడి ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు, దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం. అంతే కాదు, ఇది చాలా త్వరగా తయారే వంటకం కూడానూ. లంచ్ కు చిటికెలో తయారుచేసుకొనే ఈ వంటను ఎలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం...

Rava Kichadi Recipe For Lunch
కావల్సిన పదార్థాలు:
వైట్ రవ్వ: 2Cups
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చి మిర్చి: 5 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటా: 1 (చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి)
పచ్చిబటానీలు: 1/2cup
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీరతరుగు: 1tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 2 nos
ఏలకుల: 2 nos
జీడిపప్పు: 25 గ్రాముల
నెయ్యి: 4 tsp
ఆవాలు: 1/4tsp
పసుపు: ఒక చిటికెడు
ఆయిల్: 3 tsp
నీరు: 5 cups
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నెయ్యి వేసి వేడిచేయాలి. ఇప్పుడు అందులో నెయ్యి వేసి తక్కువ మంట మీద వేగించుకోవాలి. జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ రాగానే పక్కకు తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అందులో రవ్వ వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకొన్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత అందలో ఆవాలు వేసి చిటపటలాడాక అందులో లవంగాలు, చెక్క, యాలకులు వేసి ఒక నిముషం పాటు వేగించుకోవాలి.
4. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి కొంచె ఎక్కువ మంట పెట్టి వేగించుకోవాలి. అలాగే అందులో అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.
5. ఇవన్నీ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొన్న తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, పచ్చిబటానీ, టమోటో ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి. టమోటో మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
6. ఈ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత అందులో 5కప్పుల నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. నీరు బాగా మరిగేటప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా మరగనివ్వాలి.
7. నీరు మసాలాలతో బాగా మరుగుతన్న సమయంలో మంటను మీడయంగా పెట్టుకొని, ముందుగా వేగించి పెట్టుకొన్న రవ్వను నిదానంగా వేయాలి. రవ్వను వేసేటప్పుడూ పూర్తిగా కలియబెడుతుండాలి. లేదంటే ఉండలు కడుతుంది.
8. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి ఆవిరి మీద ఉడికించుకోవాలి. రవ్వ మృదువుగా తయారువుతుంది. ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి స్టౌ ఆఫ్ చేసి పక్కకు దింపుకోవాలి.
9. చివరగా కొత్తిమీర మరియు ముందుగా వేగించి పెట్టుకొన్న జీడిపప్పుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే రవ్వ కిచిడి మీ లంచ్ కు రెడీ.

English summary

Rava Kichadi Recipe For Lunch

When it comes to an afternoon lunch, one would think of something that is healthy and filling for the stomach. The rava kichadi recipe is one such recipe you should try out this afternoon. This vegetarian recipe made out of rava and healthy vegetables is surely a treat for lunch.
Story first published: Monday, October 21, 2013, 12:09 [IST]
Desktop Bottom Promotion