For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన అప్పాలు

|

విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా - గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. బొజ్జ గణపయ్య ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, భక్షాలు ఇలా వివిధ రకాలు పిండివంటలు వినాయకునికి ఇష్టం కాబట్టి, ఈ రోజు అప్పాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

అప్పాలు ఆంధ్రప్రాంతం వారికి ఒక సాంప్రదాయకరమైన వంటకం. ఇది చాలా ఫేమస్ వంటకం. కలర్, రుచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ తీపిలేకుండా, మీడియం అప్పాలను కూడా వివిధరకాలుగా తయారుచేస్తారు, బెల్లంతో, పంచదారతో తయారుచేస్తారు. అలాగే రవ్వ లేదా బియ్యం పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. వేటితో తయారు చేసి వీటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వినాయకచవితికి బొజ్జగణపయ్యకు ఇష్టమైన అప్పాలు ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం...

Appalu-Vinayaka Chavithi special

కావల్సిన పదార్థాలు:
బొంబాయి రవ్వ: 1cup
పంచదార: 1cup
నీళ్ళు: 2cups
నెయ్యి: 2tbsp
యాలకులు: 2tbsp
నూనె: 2cups
తయారు చేయు విధానం:
1. బొంబాయి రవ్వను పచ్చివాసన పోయే వరకూ వేయించి తీసేయాలి. నీళ్లు మరిగించి పంచదార వేయాలి.
2. తర్వాత పంచదార కరిగిన తర్వాత కొద్దికొద్దిగా రవ్వను వేస్తూ ఉండకట్టకుండా కలపాలి.
3. మూత పెట్టి తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. నీళ్ళు ఇగిరిపోయి మిశ్రమం దగ్గరగా అయ్యాక నెయ్యి, యాలకుల పొడి చల్లి బాగా కలిపి మళ్లీ మూత పెట్టేయాలి.
4. మరో 5నిముషాలు ఉడికించి క్రిందికి దించేసుకోవాలి. దింపిన పదిహేను నిముషాల తర్వాత మూత తీయ్యాలి.
5. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకుని కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న చపాతీల్లా ఒత్తుకోవాలి.
6. చివరగా వీటిని నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే విఘ్నేశ్వరుణికి ఇష్టమైన అప్పాలు రెడీ...

English summary

Appalu-Vinayaka Chavithi special

Appalu are an Authentic dish in Andhra Cuisine which are famous for their soft texture and color and of course being not overly sweet.
Story first published: Tuesday, September 3, 2013, 12:19 [IST]
Desktop Bottom Promotion