సర్వ్ చేయడానికి – 5 ఇడ్లీలు

సర్వ్ చేయడానికి – 5 ఇడ్లీలు

తయారుచేసుకోడానికి పట్టే సమయం - 15 నిముషాలు

వండడానికి పట్టే సమయం - 10 నిముషాలు

కావాల్సిన పదార్ధాలు:

కావాల్సిన పదార్ధాలు:

పిండి కోసం

1.సేమోలిన (రవ్వ) - 1 కప్పు

2.పెరుగు - పావు కప్పు

3.కొత్తిమీర ఆకులు - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)

4.ఫ్రూట్ సాల్ట్ - ¾ టేబుల్ స్పూన్

5.రుచికి సరిపడా ఉప్పు

ఇతర దార్ధాలు

ఇతర దార్ధాలు

6.నూనె - టేబుల్ స్పూన్

7.నెయ్యి - ½ టేబుల్ స్పూన్

8.మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్

9.ఆవాలు - ½ టేబుల్ స్పూన్

10.జీడిపప్పు - 1టేబుల్ స్పూన్ (ముక్కలు)

11. జీలకర్ర - ½ టేబుల్ స్పూన్

12. కరివేపాకు ఆకులు - 4

13. పచ్చిమిర్చి - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)

14. చిటికెడు ఇంగువ

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

1.ఒకపెద్ద గిన్నె తీసుకుని అందులో సేమోలినా రవ్వ, పెరుగు, ఉప్పు కలపాలి. ఇప్పుడు, అందులో నీళ్ళు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.

2.ఇప్పుడు, వంటకాన్ని సిద్ధం చేసే సమయం. ఒక చిన్న పాన్ తీసుకుని నూనె వేడిచేయాలి. అందులో నెయ్యి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, జీడిపప్పు, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేయించాలి.

3.అన్నీ బాగా వేగాక, ఈ మిశ్రమాన్ని ఆ పిండిలో వేసి, బాగా కలపాలి. అందులో కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేసి, కొద్దిగా నీళ్ళు చిలకరించాలి. ఆ పిండి ఉబ్బటం ప్రారంభిస్తుంది. మళ్ళీ బాగా కలపాలి.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

4.ఇప్పుడు, ఇడ్లీ స్టాండ్ తీసుకుని, వాటికి నూనె రాయాలి. ఇడ్లీ ప్లేట్లలో కొద్దికొద్దిగా పిండిని వేసి, ఆ ఇడ్లీ స్టాండ్ నీ స్టీమర్ పై పెట్టాలి.

5.అది ఉడకడానికి 7-8 నిమిషాలు పడుతుంది. ఒక చెంచాతో ఇడ్లీలను బైటికి తీసి, ఒక పళ్ళెంలో పెట్టండి.

6.వడ్డించడానికి వేడి వేడి రవ్వ ఇడ్లీ సిద్ధం. దీన్ని మీరు సాంబార్, కొబ్బరి చెట్నీతో వడ్డించ వచ్చు.

ఈ అద్భుతమైన వంటకాన్ని ఇంట్లోనే తయారుచేసి మీ స్నేహితులకు పెట్టండి. దీనిపై మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి.

Read more about: vegetarian breakfast idli rava ఇడ్లీ రవ్వ వెజిటేరియన్ అల్పాహారం
English summary

How To Make Quick Rava Idli At Home

This quick rava idli recipe will help you prepare breakfast in a few minutes for the days you are running short of time, take a look.
Story first published: Thursday, December 15, 2016, 12:30 [IST]
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X