Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
షహీ కాజు సబ్జీ-మొఘలాయ్ స్పెషల్
మీరు ప్రతి రోజూ తిన్న వెజిటేబుల్సే మరియు కర్రీస్ తిన్నవే, తిని మీకు బోరుగా అనిపిస్తుంటే, ఇక్కడ మీకోసం ఒక టేస్టీ కర్రీ ఉంది . ఈ వంటను చాలా సులభంగా మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు . ముఘలాయ్ కుషన్ నుండి ఒక రీగల్ డిష్.
ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను, క్రీమి టెక్చర్ ను ఇస్తుంది. ఇందులో మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల మంచి ఆరోమా వాసను ఇస్తుంది.ఇది మరింత టేస్ట్ గా ఉంటుంది. మరి ఈ స్పైసీ డిష్ ను మీరు టేస్ట్ చూడాలంటే, తయారుచేసే పద్దతిని చూడండి...

కావల్సిన పదార్థాలు:
జీడిపప్పు 1cup
టొమాటోలు: 3 (గుజ్జులా తయారుచేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క
లవంగాలు: 3
యాలకుల: 3
ధనియాలు: 1tsp
జీలకర్ర: ½tsp
షుగర్: 1tsp
ఎండు మిర్చి: 4-5
పసుపు: 1tsp
కసూరి మెంతి: ½ tsp
గరం మసాలా :½tsp
ఆంమ్చూర్ పౌడర్ (ఎండబెట్టిన మామిడి పొడి): ½ tsp
ఉప్పు :రుచికి సరిపడా
కొత్తిమీర: 2tbsp
కొత్తిమీర ఆకులు: 2tsp (సన్నగా తరిగినది)
ఆయిల్: 2tbsp
నీరు: 1 ½ cup
తయారుచేయు విధానం:
1. ముందుగా, మొత్త జీడిపప్పు అన్నింటిలోకి 5-6జీడిపప్పులను పక్కకు తీసుకోవాలి. వాటని మిక్సీలో వేసి, వాటితో పాటు, ఉల్లిపాయ, చెక్క, లవంగాలు, యాలకలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మరియు కొద్దిగా నీళ్ళు వేసి, మెత్తగా పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
2. ఇప్పుడు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ను పాన్ లో వేసి, వేడయ్యాక అందులో మిగిలిన జీడిపప్పును 3-4నిముషాలు రోస్ట్ చేయాలి. జీడిపప్పు బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ వేగించుకోవాలి. వేగిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొంత నూనె వేసి, అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ పేస్ట్ వేసి, 5నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2నిముషాలు వేగించి పెట్టుకోవాలి.
5. తర్వాత టమోటో గుజ్జు, గరం మసాలా, పసుపు, డ్రై మ్యాంగో పౌడర్ వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి.
6. ఇప్పుడు మెంతి ఆకులను రెండు చేతుల్లో వేసి నలిపి ఫ్రైఅవుతున్న మిశ్రమంలో వేయాలి.
7. తర్వాత అందులో ఉప్పు, పంచదార, మరియు ఒక కప్పు నీళ్ళు, పోసి, కర్రీని బాగా ఉడికించుకోవాలి.
8. ఈ మొత్త మిశ్రం ఉడికిన తర్వాత అందులో రోస్ట్ చేసిన జీడిపప్పు వేసి మరో 5నిముషాలు సింమ్ లో ఉడికించుకోవాలి.
9. ఒక సారి ఉడికిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కాజు సబ్జీ రెడీ. ఈ షహీ కాజు సబ్జీ రిసిని రైస్ లేదా పరోటాలతో సర్వ్ చేయండి. ఈ క్రీమి వంటను ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications











