Latest Updates
-
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026
టమోటో కార్న్ రైస్ బాత్
కార్న్ (మొక్కజొన్న)తో కాల్చి లేదా ఉడికించి లేదా సూప్ చేసుకొని తింటుంటారు. శీతాకాలంలో హాట్ కార్న్ కోసం స్టాల్స్ చుట్టూ తిరుగుతుంటాం. మనలో చాలా మంది కార్న్ ను ఈవెనింగ్ స్నాక్ గా తింటుంటారు. అంతే కాదు మన ఇంటికి వచ్చిన మన ఫ్రెండ్స్ కూడా కాఫీ మరియు టీ తో పాటు హాట్ కార్న్ ను సర్వ్ చేస్తుంటాం. కార్న్ మంచి స్నాక్ మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇందులో అధికంగా విటమిన్స్ ఉండి వ్యాధులు సోకకుండా కాపాడుతుంది.
కార్న్ తో వివిధ వెరైటీ వంటలు తయారు చేసి తింటారు. కాబట్టి మనం కూడా ఓ మంచి వెరైటీ వంట..అదే కార్న్ టమోటో బాత్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
వైట్ రైస్ - 400 gms
స్వీట్ కార్న్ - 1 cup
టమోటో గుజ్జు- 1 cup
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 6 pods (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - కొద్దిగా
గరం మసాలా - ½ tsp
పసుపు - 1/4th tsp
ఆవాలు - ½ tsp
శెనపప్పు - 1 tsp
కరివేపాకు - 10 nos
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, నువ్వులు, శెనగపప్పు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులోనే పచ్చిమిర్చి మరియు కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి.
3. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అందులో టమోటో గుజ్జు వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో ఉప్పు, గరం మసాలా, పసుపు మరియు స్వీట్ కార్న్ వేసి మీడియం మంట మీద 5 నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఈ గ్రేవీకి ముందుగా వండిపెట్టుకొన్న అన్నం జోడించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
6. మొత్తం మిశ్రమం కలగలుపుకొని తక్కువ మంట మీద మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. అంతే కార్న్ టమోటో రైస్ రిసిపి రెడీ . కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలను గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











