కార్తీక మాసం స్పెషల్: ఉసిరికాయ పప్పు

Usirikaya Pappu
కావలసిన పదార్థాలు:
కందిపప్పు: 100grm
ఉసిరికాయలు: 10
నూనె: తగినంత
పసుపు: చిటికెడు
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 4
ఎండుమిర్చి: 4
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
మినప్పప్పు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: రెండు రెమ్మలు

తయారు చేయు విధానము:
1. ముందుగా ఉసిరికాయలను ముక్కలు చేసుకోవాలి.
2. తర్వాత కందిపప్పు, ఉసిరిముక్కలను విడివిడిగా ఉడకబెట్టాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగించుకోవాలి.
4. తరవాత పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న ఉసిరిముక్కలను అందులో వేసి ఒకసారి దోరగా వేయించాలి. చివరగా ఉడికించుకున్న పప్పు, ఉప్పులను అందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే ఉసిరికాయ పప్పు రెడీ.

Story first published: Saturday, November 20, 2010, 14:18 [IST]
Desktop Bottom Promotion