Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
వెజిటేబుల్ కటీ రోల్: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిపిసి
కటిరోల్ అనే వంటకాలు కోల్ కత్తాలో చాలా ఫేమస్. సాధారణంగా కటిరోల్లో కబాబ్ చుట్టిన పరాటాలను సర్వ్ చేస్తుంటారు. కటీ రోల్ చాలా డిఫరెంట్ గా తయారు చేస్తుంటారు. అందులో స్టఫింగ్ కోసం ఉపయోగించే వాటిలో చాలా వివిధ రకాల వస్తువులను వాడి, డిఫరెంట్ గా డిఫరెంట్ టేస్ట్ తో తయారు చేస్తారు.
ఇక్కడ కబాబ్ లకు బదులు, వెజిటేబుల్స్ ను ఉపయోగించి వెజిటేబుల్ కటీ రోల్ తయారు చేస్తున్నాం. వెజిటేబుల్స్ తినని పిల్లల కోసం ఈ విధంగా చేసి ఇవ్వొచ్చు. పెద్దలకూడా రెగ్యులర్ చపాతీ తిని బోర్ కొడుతున్నా ఈ విధంగా తయారు చేసుకొన్ని కోల్ కత్తా టేస్ట్ ను రుచి చూడవచ్చు...
గోధుమ పిండి: 3cups
మైదా: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
మిక్స్డ్ వెజిటేబుల్స్: 1cup(క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ మొదలగునవి కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పసుపు: చిటికెడు
ఛాట్ మసాలా: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
నూనె: 1btsp
నీళ్ళు: 1cup
తయారు చేయు విధానం:
1. ముందు గోధుమ పిండి, మైదా మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకోవాలి.
3. తర్వాత కూరగాయ ముక్కలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి 5-6నిముషాలు మీడియం మంట మీదు వేగించుకోవాలి.
4. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఛాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే అవసరం ఐతే కొద్దిగా నీళ్ళు కూడా చిలకరించి మూత పెట్టి 10నిముషాలు ఉడికించుకోవాలి.
6. ఈ మిశ్రమం మొత్తం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
7. ఇప్పుడు చపాతీ పిండిని నుండి కొద్దికొద్దిగా పిండి తీసుకొని చాపాతీ కర్రతో చపాతీలా రోల్ రుద్దుకోవాలి. తర్వాత చపాతీ పాన్ మీద వేసి రెండు వైపులా లైట్ గా కాల్చుకొని సెంటర్ లో ఫ్రై చేసి పెట్టుకొన్న వెజిటేబుల్ మిశ్రమాన్ని పెట్టి రోల్ చేయాలి.
8. తర్వాత చివర్లు కవర్ చేస్తూ సిల్వర్ ఫోయిల్ తో చుట్టి సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ కటీ రోల్ సర్వ్ చేయడానికి రెడీ. ఈ బ్రేక్ ఫాస్ట్ ను కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications












