Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా!

Posted By:

తేనె..ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లూరుపోతుంటాయి. పొద్దున్నే లేచినదగ్గరనుంచి రాత్రి పడుకునేదాకా తీసుకునే ఆహారాలు, డ్రింక్స్ లో చాలామంది తేనును వాడుతుంటారు. అయితే ఒరిజనల్ తేనె అంటూ ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బ్రాండ్ల పేరుతో దీనిని అమ్ముతున్నారు. అయితే మార్కెట్లో లభించే తేనేలో చాలావరకు షుగర్ సిరప్, ఇతర సిరప్ లు, నిల్వ చేసే కెమికల్స్ తో కల్తీ చేయబడి ఉంటది. దీనిని మనం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు పక్కన పెడితే నష్టమే ఎక్కువ ఉంటది.

మరోవైపు పూర్తి శాఖాహారులు,వీగన్ డైట్(జంతు ఉత్పత్తులు తినరు) ఫాలో అయ్యేవాళ్లు తేనెటీగల నుంచి లభించే తేనెను తీసుకోరు. ఇలాంటప్పుడు 100 శాతం స్వచ్ఛమైన, కెమెకల్స్ లేని తేనెను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. దీని టేస్ట్, వాసన సేమ్ తేనెటీగల తేనె మాదిరే ఉంటుంది. దీనిని తయారుచేసుకోడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. మన వంటగదిలో రెగ్యులర్ గా ఉండే పదార్థాలతోనే తేనెను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Vegan Honey Recipe How to Make Pure Chemical Free Honey at Home in Telugu

ఇంట్లోనే తేనె తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోండి. అందులో 1 కప్పు యాపిల్ జ్యూస్ వేయండి. ఇందులోనే ఒక కప్పు చక్కెర వేయండి. మీడియం మంట మీద గరిటతో కలుపుతూ చక్కెర కరిగేవరకు మరిగించాలి.

జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా..

-చక్కెర యాపిల్ జ్యూస్ లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. నిమ్మరసం చక్కెర గడ్డకట్టకుండా,తేనెను ఎక్కువ కాలం పాటు చిక్కగా మెరిసేలా ఉంచడానికి సహాయపడుతుంది.

-నిమ్మరసం వేసిన తర్వాత మంను సిమ్ లో ఉంచి..10 నిమిషాలు ఉడకనివ్వాలి. అది ఉడుకుతున్నప్పుడే అందులో 1 చామంతి టీ బ్యాగ్ లేదా 2 లవంగాలు వేసి తర్వాత వాటిని తీసేయడం ద్వారా నేచురల్ తేనె లాంటి వాసన వస్తుంది.

-10 నిమిషాల తర్వాత మిశ్రమం లేత బంగారు గోధుమ రంగులోకి మారి పాకంలా కనబడితే స్టవ్ ఆపేయండి. దీనిని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

-అంతే తేనె రెడీ.

-తయారైన తేనెను గాజు సీసాలో నిల్వ చేసుకుంటే నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకకపోయినా కూడా ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 22, 2026, 15:19 [IST]
Desktop Bottom Promotion