Latest Updates
-
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే!
బరువు తగ్గాలనుకుంటున్నారా? 'లసూని పాలక్ కిచిడి' మీకు బెస్ట్..ఎలా చేసుకోవాలంటే
నార్త్ ఇండియాలో చాలా ఫేమస్, చాలా ఈజీగా తయారుచేసుకోగలిగే వంటకం లసూని పాలక్ కిచిడి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంగా లేదా రాత్రి తేలికపాటి విందుగా దీనిని తీసుకోవచ్చు. ఇందులో వాడే వెల్లుల్లి మరియు పాలకూర వల్ల దీనికి ప్రత్యేకమైన సువాసన, రుచి వస్తాయి. సులభంగా జీర్ణమయ్యే ఈ వంటకం పిల్లలకు, పెద్దలకు, అనారోగ్యంతో ఉన్నవారికి కూడా మంచిది. లసూని పాలక్ కిచిడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించి, అనవసరంగా తినడాన్ని తగ్గిస్తుంది..తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నార్త్ ఇండియా ఫేమస్ లసూని పాలక్ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
లసూని పాలక్ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం: 1 కప్పు బాస్మతి లేదా సాధారణ బియ్యం
-పెసరపప్పు: పొట్టు తీసిన 1/2 కప్పు
-పాలకూర: 2 కట్టలు
-వెల్లుల్లి: 10-12 రెబ్బలు
-ఉల్లిపాయ: 1 పెద్దది
-పచ్చిమిర్చి: 2-3
-అల్లం: 1 అంగుళం ముక్క
-టమాటో: 1
-నెయ్యి/నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-జీలకర్ర: 1 టీస్పూన్
-ఇంగువ: చిటికెడు
-పసుపు: 1/2 టీస్పూన్
-కారం: 1/2 టీస్పూన్
-ధనియాల పొడి: 1 టీస్పూన్
-గరం మసాలా: 1/2 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నీళ్ళు: 4-5 కప్పులు
-కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా బియ్యం,పెసరపప్పును కడిగి కనీసం అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత పాలకూరను శుభ్రంగా కడిగి వేడి నీటిలో 2-3 నిమిషాలు ఉడికించి వెంటనే చల్లటి నీటిలో వేయాలి . తర్వాత నీటిని తీసేసి మిక్సీలో వేసి పేస్ట్ గా చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ ను పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేయాలి.
-నెయ్యి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఇంగువ వేయాలి. తరిగిన వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి కొన్ని సెకన్లు వేయించాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి అవి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు తరిగిన టమాటోలు అందులో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. మసాలాలు మాడకుండా కొద్దిగా నీళ్లు కలపవచ్చు.
-తర్వాత నానబెట్టి వడకట్టిన బియ్యం, పెసరపప్పును కుక్కర్లో వేసి 2 నిమిషాలు వేయించాక పేస్ట్ చేసుకున్న పాలకూరను వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు 4-5 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు లేదా బియ్యం, పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి.
-తర్వాత స్టవ్ ఆపి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తెరవాలి.
-ఇప్పుడు తాళింపు కోసం ఒక చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె వేడి చేసి అందులో మిగిలిన తరిగిన వెల్లుల్లి (2-3 రెబ్బలు), 1-2 ఎండు మిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి, వెల్లుల్లి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఈ తాలింపును ఉడికించిన కిచిడిపై పోయాలి. తరిగిన కొత్తిమీర దానిమీద చల్లుకోండి. అంతే లసూని పాలక్ కిచిడి రెడీ. వేడి వేడిగా పెరుగు, ఆవకాయ లేదా పచ్చడితో కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications


