Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
రుచిలో అదుర్స్,ఆరోగ్యానికి నంబర్ వన్..బరువు తగ్గించే రాగి సూప్ చేసుకోండిలా..
భారతదేశ సంప్రదాయ ఆహారంలో రాగులది ముఖ్యమైన స్థానం. వందల ఏళ్లుగా మన పూర్వీకులు రాగులను వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించారు. రాగి మాల్ట్, రాగి దోసె, రాగి రొట్టె, రాగి జావ ఇవన్నీ మనకు సుపరిచితమైనవే. ఆధునిక ఆహారపు అలవాట్లలో సూప్ కి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఆహారపు అలవాట్లలోకి సంప్రదాయ ధాన్యమైన రాగులను జోడించి తయారుచేసేదే రాగి సూప్.
రాగి సూప్ కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి ఎన్నో ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఇది చాలా సాయపడుతుంది. రాగులలో ఉండే అధిక పీచుపదార్థం కారణంగా తక్కువ మొత్తంలో సూప్ తీసుకున్నప్పటికీ ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇంకా,ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రాగి సూప్ ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

రాగి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఆయిల్- 1 టీస్పూన్
అల్లం- 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి- 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - కొన్ని
ఉల్లిపాయ- 1 చిన్నది
క్యారెట్- పావు కప్పు
క్యాప్సికం- పావు కప్పు
ఫెంచ్ బీన్స్- పావు కప్పు
స్వీట్ కార్న్-పావు కప్పు
నీళ్లు - తగినన్ని
ఉప్పు-రుచికి సరిపడా
మిరియాల పొడి-రుచికి తగినంత
రాగి పిండి- 15 గ్రాములు
స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్- అలంకరణ కోసం
రాగి సూప్ తయారీ విధానం
-ముందుగా ఓ గిన్నెలో రాగపిండి వేసి కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అ టీస్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో అల్లం సన్నని తరుగు,వెల్లుల్లి తరుగు,పచ్చిమిర్చి తరుగు వేసి 1 నిమిషం వేయించాక ఇందులో ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, క్యాప్సికం తరుగు, ఫ్రెంచ్ బీన్స్, స్వీట్ కార్న్ వేసి వేయించాలి.
-కూరగాయల ముక్కలన్నీ కొంచెం వేగాక అందులో సరిపడా నీళ్లు పోసి అందులో మిరియాల పొడి వేసి కలిపాక ఇందులోనే కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని పోసి గరిటతో బాగా కలపాలి.
-దించేముందు అందులో స్ప్రింగ్ ఆనియన్ కాడల తరుగు వేసి కలుపుకోవాలి.
-రెడీ అయిన రాగి సూప్ ని ఓ బౌల్ లేదా గిన్నెలో పోసుకొని నిమ్మకాయ పిండుకొని తాగుతుంటే వావ్ అని తీరాల్సిందే. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications