Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
పెళ్లి భోజనం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఘుమఘుమలాడే స్టార్టర్స్. అందులోనూ వేడివేడిగా, కరకరలాడుతూ వడ్డించే చిల్లీ గోబీ(గోబీ 65)కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ స్పైసీ రుచిని ఆస్వాదిస్తుంటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే పెళ్లిళ్ల స్పెషల్ చిల్లీ గోబీని అచ్చం అదే రుచితో మన ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

చిల్లీ గోబీ తయారీకి కావలసిన పదార్థాలు
క్యాలీఫ్లవర్ - 1
మైదా పిండి - 4 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 4 టేబుల్ స్పూన్లు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి- 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారం - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ప్రత్యేక మసాలా పొడి:
యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, సోంపు, జీలకర్ర, షాజీరా.. ఇవన్నీ
ఒక్కో చిటికెడు చొప్పున దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
చిల్లీ గోబీ తయారీ విధానం
-ముందుగా క్యాలీఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేయండి. ఇప్పుడు కట్ చేసిన గోబీ ముక్కలను ఆ వేడి నీటిలో వేసి 2-3 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు సగం ఉడికి లోపల మెత్తగా ఉంటాయి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి, ముక్కలను చల్లారనివ్వాలి.
-ముక్కలు చల్లారిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో మైదా, కార్న్ ఫ్లోర్, శనగపిండి, బియ్యప్పిండి వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, మనం ముందుగా దంచి పెట్టుకున్న ప్రత్యేక మసాలా పొడి, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు చల్లుతూ, పిండి, మసాలాలు గోబీ ముక్కలకు బాగా పట్టేలా మెల్లగా కలపాలి. దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెడితే ముక్కలకు మసాలా బాగా పడుతుంది.
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా..
-స్టవ్ వెలిగించి, బాండీలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
-నూనె కాగాక, మసాలా పట్టించిన గోబీ ముక్కలను విడివిడిగా నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, ముక్కలు అన్ని వైపులా మంచి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించుకుని బయటకు తీయాలి.
-అంతే నోరూరించే చిల్లీ గోబీ రెడీ. పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసం పిండుకుని తింటుంటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. సాయంత్రం స్నాక్స్ గా లేదా బిర్యానీలోకి సైడ్ డిష్ గా దీనిని ఆస్వాదిచవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
