Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే
వీకెండ్ లో ఎప్పుడూ అవే పులావ్ లు అవే చికెన్ బిర్యానీలు తిని తిని బోర్ కొట్టేసిందా? కొత్తగా ఏదైనా రుచిగా తినాలనిపిస్తుందా? మీ వంటగదిలో కాస్త జీలకర్ర సంబా బియ్యం, మీల్ మేకర్ (సోయా చంక్స్) ఉన్నాయా? అయితే అచ్చం రెస్టారెంట్ రుచిని తలపించే తమిళనాడు ఫేమస్ అంబూర్ స్టైల్ మీల్ మేకర్ బిర్యానీ ట్రై చేయండి. వంట రాని బ్రహ్మచారులు కూడా దీనిని ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీని రుచి చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు.

అంబూర్ స్టైల్ మీల్ మేకర్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
జీలకర్ర సంబా బియ్యం - 1 కప్పు
మీల్ మేకర్ - 1 కప్పు
పెద్ద ఉల్లిపాయలు - 2
టమాటో - 1
ఎండు మిర్చి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
పుదీనా, కొత్తిమీర - గుప్పెడు చొప్పున
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - ఒకటిన్నర కప్పు
చిక్కటి పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
లవంగాలు - 2
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
యాలకులు - 2

అంబూర్ స్టైల్ మీల్ మేకర్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా 6 ఎండు మిరపకాయలను వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి, మెత్తని పేస్ట్ లా రుబ్బుకోండి. బిర్యానీకి ఆకర్షణీయమైన రంగు రావాలంటే ఇందులో 4 కశ్మీరీ ఎండు మిర్చిని కూడా కలిపి రుబ్బుకోండి.
-ఇప్పుడు అల్లం, వెల్లుల్లిని విడివిడిగా మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని బాగా మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసి, అందులో మీల్ మేకర్ (సోయా చంక్స్) వేయండి. అవి పరిమాణంలో రెట్టింపు అయ్యేలా మెత్తబడేవరకు ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటిలో కడిగి, అందులో నీరంతా పోయేలా గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. వేడెక్కాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయండి. ఆ వెంటనే వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించి, ముందుగా రుబ్బి పెట్టుకున్న ఎండు మిర్చి పేస్ట్ వేసి బాగా కలపండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి పారదర్శకంగా మారే వరకు వేయించండి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించండి. ఇప్పుడు నీళ్లు పిండి పెట్టుకున్న సోయా చంక్స్ వేసి మసాలా అంతా వాటికి పట్టేలా బాగా కలపండి.
-చివరగా తరిగిన పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పెరుగు, నిమ్మరసం వేసి కలపండి. అందులోనే ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఎసరును బాగా మరిగించండి. ఎసరు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న జీలకర్ర సంబా బియ్యాన్ని వేసి కలపండి. కుక్కర్ మూతపెట్టి, తక్కువ మంట మీద కేవలం ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయండి.
-ప్రెషర్ అంతా పోయాక మెల్లగా మూత తీసి చూడండి.. ఎంతో రుచికరమైన అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ రెడీ. చల్లని ఉల్లిపాయ రైతాతో దీన్ని తింటే కేక అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
