రొటీన్ స్వీట్లకు బదులు.. ఈ హోలీకి నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మటి తీయని పెరుగు.. ఇంట్లోనే చేసుకోండిలా!

Posted By:

రంగుల పండుగ హోలీ వచ్చేస్తోంది. ఈ పండుగ రోజున రంగుల ఆటలతో పాటు, నోరూరించే వంటకాలు ఆరగించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఈసారి రొటీన్ స్వీట్లకు భిన్నంగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన తీయటి పెరుగు తయారు చేస్తే ఎలా ఉంటుంది?

వేసవిలో పెరుగు తీసుకోవడం శరీరానికి చలవ చేయడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మార్కెట్లో కొనే పని లేకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ కమ్మటి తీయని పెరుగును ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ హోలీకి మీ కుటుంబ సభ్యులను, అతిథులను ఆకట్టుకునే ఈ స్పెషల్ డెజర్ట్ తయారీ విధానం ఇక్కడ చూడండి.

Welcome Summer and Holi with this Refreshing 3 Ingredient Sweet Curd Dessert Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
క్రీమ్ ఉన్న చిక్కటి పాలు: 1 లీటరు
చక్కెర: 4 టేబుల్ స్పూన్లు
పెరుగు తోడు (స్టార్టర్): 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోండి. ఇందులో పాలు పోసి బాగా మరిగించండి. పాలు పొంగు వచ్చిన తర్వాత, మంటను తక్కువలో ఉంచి, మరో 5 నుంచి 7 నిమిషాల పాటు పాలను నెమ్మదిగా మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల పాలు కొద్దిగా చిక్కబడి, పెరుగుకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది.

-పాలు మరుగుతున్నప్పుడే అందులో మీరు తీసుకున్న చక్కెరను వేసి గరిటెతో బాగా కలపండి. చక్కెర పాలలో పూర్తిగా కరిగిపోయేలా చూసుకోండి.

స్ట-వ్ ఆఫ్ చేసి పాలను చల్లారనివ్వాలి. పాలు పూర్తిగా చల్లారిపోకూడదు, అలాగని మరీ వేడిగా ఉండకూడదు. కేవలం గోరువెచ్చగా ఉండాలి. మీ వేలును పాలలో ముంచి 10 సెకన్ల పాటు సులభంగా ఉంచుకోగలిగితే, పాలు పెరుగు తోడుకోవడానికి సరైన వేడిలో ఉన్నాయని అర్థం.

-ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు (తోడు) తీసుకోండి. అందులో ఎలాంటి ఉండలు లేకుండా ఒక చెంచాతో మెత్తని పేస్ట్ లాగా బాగా గిలక్కొట్టండి.

-ఇప్పుడు గిలక్కొట్టిన ఈ పెరుగును.. ముందుగా సిద్ధం చేసుకున్న గోరువెచ్చని పాలలో వేసి బాగా కలపండి. పాలు, పెరుగు బాగా కలవడానికి.. పాలను ఒక గిన్నె నుండి మరో గిన్నెలోకి పైనుంచి ధారగా 2 లేదా 3 సార్లు పోయాలి. ఇలా చేస్తే పాలలో చక్కటి నురుగు వచ్చి, పెరుగు మీగడలా అద్భుతంగా గట్టిపడుతుంది.

-ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని మూత గట్టిగా ఉండే ఒక మట్టి కుండలో లేదా హాట్ బాక్స్ లో పోసి గాలి చొరబడకుండా మూతపెట్టండి. మట్టి కుండలో అయితే అచ్చమైన సంప్రదాయ రుచి వస్తుంది. వేసవి కాలం కాబట్టి వాతావరణంలో ఉండే వేడికి కేవలం 4 నుంచి 5 గంటల్లోనే పెరుగు గట్టిగా తోడుకుంటుంది.

-మరింత రుచి కావాలనుకుంటే పాలు మరుగుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి కలుపుకోవచ్చు. పెరుగు గట్టిపడిన తర్వాత, దానిని ఫ్రిజ్‌ లో పెట్టి భోజనం తర్వాత చల్లచల్లగా వడ్డిస్తే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Thursday, February 26, 2026, 11:59 [IST]
Desktop Bottom Promotion