Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
దాబా స్టైల్ మేథీ మటర్ మలై..చపాతీలోకి కేక..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఈ శీతాకాలంలో మార్కెట్‌కి వెళ్తే పచ్చని మెంతికూర, తాజా బఠానీలు విరివిగా కనిపిస్తాయి. మరి వీటిని ఉపయోగించి రొటీన్ కూరలు కాకుండా, కాస్త కొత్తగా, రిచ్‌గా ఏదైనా ట్రై చేయాలని ఉందా? అయితే ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మేథీ మటర్ మలై ట్రై చేయండి.
మెంతికూరలో ఉండే సన్నని చేదు, బఠానీలలో ఉండే తీపి, వీటన్నింటినీ కలుపుతూ వచ్చే క్రీమీ గ్రేవీ.. ఆ రుచే వేరు. ఇది అన్నంలోకి మాత్రమే కాదు, చపాతీ, నాన్, పరాఠాల్లోకి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నా లేదా డిన్నర్ ని స్పెషల్ గా మార్చాలన్నా ఈ రెసిపీ బెస్ట్ ఛాయిస్. మరి ఇంటిల్లిపాది వేళ్లు నాక్కుంటూ తినేలా ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మెంతికూర - 1 కప్పు
పచ్చి బఠానీలు- అర కప్పు
ఉల్లిపాయలు - 2
జీడిపప్పు - 15
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం ముక్క
ఫ్రెష్ క్రీమ్ - అర కప్పు
పాలు - అర కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
పసుపు - చిటికెడు
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
చక్కెర - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా మెంతికూరను శుభ్రం చేసి ఒక గిన్నెలో నీళ్లు, కొంచెం ఉప్పు వేసి అందులో ఆకులను 10-15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నీటిని గట్టిగా పిండేసి ఆకులను పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుంది.
-జీడిపప్పును వేడి నీటిలో 15 నిమిషాలు నానబెట్టండి.
-తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోండి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, బిర్యానీ ఆకు వేయండి. అవి చిటపటలాడాక సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ-జీడిపప్పు పేస్ట్‌ను వేయండి. మంటను మీడియంలో పెట్టి,పచ్చి వాసన పోయి పేస్ట్ నుండి నెయ్యి వేరుపడే వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో పసుపు, ధనియాల పొడి వేసి కలిపాక శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి మరో 2-3 నిమిషాలు వేయించండి. ఆకు మెత్తబడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలను వేసి కలపండి.
-ఇప్పుడు కూరలో పాలు, ఫ్రెష్ క్రీమ్ పోసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ముఖ్యంగా అర స్పూన్ చక్కెర వేయండి. చక్కెర వేయడం వల్ల మెంతిలోని వగరు తగ్గి, రెస్టారెంట్ రుచి వస్తుంది. మూత పెట్టి సన్నని మంటపై ఒక 5 నిమిషాలు ఉడికించండి.
-గ్రేవీ చిక్కబడి, కమ్మని వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన, క్రీమీ మేథీ మటర్ మలై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications