Latest Updates
-
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.!
రెస్టారెంట్ స్టైల్ క్రీమీ టమాటా సూప్..బ్రెడ్ ముక్కలతో తింటే స్వర్గమే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి గత కొద్ది రోజులుగా బాగా పెరిగిపోయింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ క్లైమేట్ లో చాలామందిని సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మన శరీరానికి వెచ్చదనం, రోగనిరోధక శక్తి చాలా అవసరం.
ఈ చలికాలం సాయంత్రం వేళ ఘుమఘుమలాడే వేడి వేడి టమాటా సూప్ తాగితే ఆ మజానే వేరు. ఇది కేవలం రుచి కోసమే కాదు, గొంతు నొప్పికి ఉపశమనంగా, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అచ్చం రెస్టారెంట్ రుచితో అంతకంటే ఆరోగ్యకరంగా కేవలం 15 నిమిషాల్లోనే మనం ఇంట్లో దీనిని తయారు చేసుకోవచ్చు. క్రీమీ టమాటో సూప్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వెన్న: 1 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు: 1
మిరియాలు: 1 టీస్పూన్
బెంగళూరు టమోటాలు: 4
క్యారెట్: 1
కాశ్మీరీ ఎండుమిర్చి: 1
అల్లం: 1 అంగుళం ముక్క
వెల్లుల్లి: 5 రెబ్బలు
చిన్న ఉల్లిపాయ: 1
కొత్తిమీర కాడలు: కొద్దిగా
నీరు: 3 కప్పులు
ఉప్పు: రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్: అర టీస్పూన్
మిరియాల పొడి: రుచికి తగినంత
కొత్తిమీర: గార్నిష్ కోసం
నూనె: 1 టేబుల్ స్పూన్
బ్రెడ్ ముక్కలు: 3 స్లైసెస్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, మిరియాలు, టమోటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కాశ్మీరీ ఎండుమిర్చి, కొత్తిమీర కాడలను వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు కుక్కర్ లో సుమారు ముప్పావు లీటరు నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
-ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి. ఒక పెద్ద గిన్నెలో జల్లెడ పెట్టి ఉడికించిన మిశ్రమాన్ని వడకట్టండి. కింద వచ్చిన నీటిని పారబోయకుండా పక్కన పెట్టుకోండి.
-జల్లెడలో మిగిలిపోయిన టమోటా, క్యారెట్ ముక్కల నుంచి బిర్యానీ ఆకును తీసివేసి, మిగిలిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని ఈ పేస్ట్ ని మళ్ళీ జల్లెడలో వేసి, మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉడికించిన నీరును కొద్ది కొద్దిగా పోస్తూ వడకట్టండి.
-ఈ సూప్ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఒక చిన్న గిన్నెలో అర టీస్పూన్ కార్న్ ఫ్లోర్ ని కొద్దిగా నీటిలో కలిపి, మరుగుతున్న సూప్ లో పోసి మీడియం మంట మీద 5 నిమిషాలు మరిగించండి.
-చివరగా స్టవ్ ఆపేసి, తాజా మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. టమాటా సూప్ రెడీ.
-పక్కన మరో పాన్ లో కొద్దిగా నూనె లేదా వెన్న వేసి, బ్రెడ్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు క్రిస్పీగా వేయించుకోండి.
-సర్వింగ్ బౌల్ లోకి సూప్ తీసుకుని, పైన వేయించిన బ్రెడ్ ముక్కలు వేసుకుని తింటుంటే అమృతంలా అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications