Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేవలం 4 పదార్థాలతో..అమృతం లాంటి పీనట్ బటర్..ఎలా చేసుకోవాలంటే..
చలికాలం వచ్చిందంటే చాలు సాయంత్రం వేళ వేడివేడిగా వేరుశెనగలు తింటూ కుటుంబంతో కబుర్లు చెప్పుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వేరుశెనగలు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మొక్కల ఆధారిత ప్రోటీన్ కోసం చూసే వారికి ఇవి అద్భుతమైన వరం.
అందుకే ఫిట్ నెస్ ప్రియులు, జిమ్ చేసేవారు తమ డైట్ లో పీనట్ బటర్ ను తప్పనిసరిగా చేర్చుకుంటారు. అయితే మార్కెట్లో దొరికే పీనట్ బటర్ లో రుచి కోసం అధిక మోతాదులో చక్కెర, నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్, నాణ్యత లేని నూనెలు కలుపుతుంటారు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఎలాంటి కల్తీ లేకుండా, స్వచ్ఛమైన,ఆరోగ్యకరమైన పీనట్ బటర్ ను మనమే ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వేరుశెనగలు: 300 గ్రాములు (2 కప్పులు)
నల్ల ఉప్పు: పావు టీస్పూన్
తేనె: 1 టీస్పూన్
నెయ్యి: 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా మందపాటి అడుగు ఉన్న పాన్ ను స్టవ్ మీద పెట్టి వేరుశెనగలను వేయండి. మంటను చాలా తక్కువలో ఉంచి, సుమారు 20 నిమిషాల పాటు దోరగా వేయించాలి. గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది. గింజల నుంచి పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-వేయించిన వేరుశెనగలను ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అవి పూర్తిగా చల్లారాక ఒక శుభ్రమైన కాటన్ టవల్ లో వేసి మూటకట్టి, చేతితో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పొట్టు సులభంగా వేరుపడుతుంది.
-మీకు పీనట్ బటర్ తినేటప్పుడు పంటికి గింజలు తగలాలంటే పొట్టు తీసిన గింజల్లోంచి గుప్పెడు గింజలను మిక్సీలో వేసి బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిగిలిన వేరుశెనగలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయడం ప్రారంభించండి. మొదట పొడిలా అవుతుంది, ఆపై గింజల్లోని సహజ నూనెలు బయటకు వచ్చి ముద్దగా మారుతుంది. మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే ఒక టీస్పూన్ నెయ్యి జతచేయవచ్చు.
-మిశ్రమం వెన్నలా మృదువుగా మారాక దానికి తగినంత తేనె, చిటికెడు నల్ల ఉప్పు వేసి పల్స్ మోడ్ లో ఒకటి రెండు సార్లు తిప్పాలి. చివరగా ముందుగా పక్కన పెట్టుకున్న బరక పొడిని కూడా కలిపితే ఎంతో రుచికరమైన క్రంచీ పీనట్ బటర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications