యెరయెప్ప రెసిపి ; తీయని దోశను తయారుచేయటం ఎలా

Posted By: Lekhaka
Subscribe to Boldsky

యెరయెప్ప కర్ణాటక రకపు సాంప్రదాయ తీపి వంటకం. ఇది ఉడుపి నుంచి వచ్చింది. దీన్ని తీపి దోశ అని కూడా అంటారు మరియు దీన్ని నానబెట్టిన బియ్యం, కొబ్బరి ఇంకా బెల్లం పాకం కలిపి తయారుచేస్తారు. ఈ పిండిని దోశల్లా వేసుకుంటారు.

తియ్యగా ఉండటం వలన యెరయెప్ప పిల్లలకి చిరుతిండిలా పనికొస్తుంది. పాన్ కేక్ కి దక్షిణభారత రూపం ఇది. నేరుగానే తినేయచ్చు లేదా తేనె, మేపల్ సిరప్ తో కలిపి తినవచ్చు. యెరయెప్పను నూనెలో వేయించుకుని కూడా తినవచ్చు. ఇక్కడ మేము పాన్ కేక్ స్టైల్ దోశల్లాగా ఆరోగ్యకరంగా తయారుచేసాం.

తీపి దోశ లేదా వెల్లం దోశ చాలా సులభమైన చిన్న రెసిపి. బియ్యం నానితే, ఇది చిటికెలో చేసేసుకోవచ్చు. మీకు వంటగదిలో పెద్ద సమయం కూడా పట్టదు. ఇంకా పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. దీన్ని మీరు కూడా ఇంట్లో ప్రయత్నించాలనుకుంటే, చిత్రాలు, వీడియోతో కూడిన కింద తయారీ విధానం చదవండి.

yereyappa recipe
యేరెయప్ప రెసిపి । తీపి దోశ చేయటం ఎలా । వెల్లం దోశ తయారీ । బెల్లం దోశ రెసిపి
యేరెయప్ప రెసిపి । తీపి దోశ చేయటం ఎలా । వెల్లం దోశ తయారీ । బెల్లం దోశ రెసిపి
Prep Time
6 Hours
Cook Time
30M
Total Time
6 Hours 30 Mins

Recipe By: కావ్య శ్రీ ఎస్

Recipe Type: స్వీట్లు

Serves: 4

Ingredients
 • బియ్యం - ½ గిన్నె

  నీరు - 1 కప్పు

  బెల్లం - 1 కప్పు

  తురిమిన కొబ్బరి - 1 కప్పు

  ఏలకుల పొడి - ¾ వ చెంచా

  నెయ్యి - ½ కప్పు

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. గిన్నెలో బియ్యాన్ని తీసుకుని ముప్పావు కప్పు నీళ్లను పోయండి.

  2. రాత్రంతా బియ్యాన్ని నానబెట్టి అదనంగా ఉన్న నీరును తీసేయండి.

  3. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్ లో వేయండి.

  4. తురిమిన కొబ్బరిని కూడా వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బండి.

  5. ఇంకో గిన్నెలోకి అది తీసుకోండి.

  6. వేడిచేసిన పెనంలో బెల్లం వేయండి.

  7. వెనువెంటనే పావు కప్పు నీరు పోయండి.

  8. బెల్లాన్ని కరగనిచ్చి పాకాన్ని మరగనివ్వండి.

  9. ఈ బెల్లంపాకాన్ని మిశ్రమం ఉన్న గిన్నెలోకి మార్చండి.

  10. ఏలకుల పొడిని వేసి, మెత్తని పిండిలా బాగా కలపండి.

  11. పావుచెంచా నెయ్యిని వేడి పెనంలో వేయండి.

  12. ఈ పిండిని వేసి గుండ్రంగా దోశ మాదిరి నెరపండి.

  13. కింద కొంచెం గోధుమ రంగులోకి వేగగానే వెనక్కి తిప్పు ఇంకోవైపు వేయించండి.

  14. అయిపోగానే, స్టవ్ ఆపేసి వేడివేడిగా వడ్డించండి.

Instructions
 • 1. పిండి రుబ్బేముందు నానబెట్టిన బియ్యంలో అదనంగా ఉన్న నీళ్ళని తీసేయండి.
 • 2. సాదా దోశపిండి కన్నా ఈ పిండి కొంచెం గట్టిగా ఉండాలి.
 • 3. మంచి దోశలు రావాలంటే బియ్యాన్ని రాత్రంతా నానపెట్టాలి.
 • 4. కొంతమంది పిండిని దోశలా వేయటం కన్నా పిండినే కాల్చుకుని తినటాన్ని ఇష్టపడతారు.
Nutritional Information
 • వడ్డించే పరిమాణం - 2 అట్లు
 • క్యాలరీలు - 149 క్యాలరీలు
 • కొవ్వు - 5 గ్రాములు
 • ప్రొటీన్ - 3 గ్రాములు
 • కార్బొహైడ్రేట్లు - 22 గ్రాములు
 • చక్కెర - 2.8 గ్రాములు
 • ఫైబర్ - 1 గ్రాము

తయారీవిధానం

1. గిన్నెలో బియ్యాన్ని తీసుకుని ముప్పావు కప్పు నీళ్లను పోయండి.

yereyappa recipe
yereyappa recipe

2. రాత్రంతా బియ్యాన్ని నానబెట్టి అదనంగా ఉన్న నీరును తీసేయండి.

yereyappa recipe

3. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్ లో వేయండి.

yereyappa recipe

4. తురిమిన కొబ్బరిని కూడా వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బండి.

yereyappa recipe
yereyappa recipe

5. ఇంకో గిన్నెలోకి అది తీసుకోండి.

yereyappa recipe

6. వేడిచేసిన పెనంలో బెల్లం వేయండి.

yereyappa recipe

7. వెనువెంటనే పావు కప్పు నీరు పోయండి.

yereyappa recipe

8. బెల్లాన్ని కరగనిచ్చి పాకాన్ని మరగనివ్వండి.

yereyappa recipe

9. ఈ బెల్లంపాకాన్ని మిశ్రమం ఉన్న గిన్నెలోకి మార్చండి.

yereyappa recipe

10. ఏలకుల పొడిని వేసి, మెత్తని పిండిలా బాగా కలపండి.

yereyappa recipe

11. పావుచెంచా నెయ్యిని వేడి పెనంలో వేయండి.

yereyappa recipe

12. ఈ పిండిని వేసి గుండ్రంగా దోశ మాదిరి నెరపండి.

yereyappa recipe

13. కింద కొంచెం గోధుమ రంగులోకి వేగగానే వెనక్కి తిప్పు ఇంకోవైపు వేయించండి.

yereyappa recipe
yereyappa recipe

14. అయిపోగానే, స్టవ్ ఆపేసి వేడివేడిగా వడ్డించండి.

yereyappa recipe
yereyappa recipe
[ 5 of 5 - 88 Users]
Story first published: Monday, September 25, 2017, 14:28 [IST]