Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.!
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పెరుగు తాజాగా, తియ్యగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉన్నా, పులిసినా తినడానికి కష్టంగా అనిపిస్తుంది. పెరుగు రెండు, మూడు రోజులు అలాగే బయట ఉంది అంటే పులిసిపోతుంది. అందుకే పుల్లగా అయిన పెరుగును చాలా మంది పడేస్తుంటారు. కొంతమంది వేస్ట్ చేయడం ఇష్టం లేక మజ్జిగ చేసుకుని ఉప్పు కలుపుకొని అయిష్టంగానే తాగేస్తుంటారు. కానీ ఇకపై ఆ అవస్థలు వద్దు.. పులిసిన పెరుగును పడేయకుండా ఇలా ఇంట్లో చాలా పనులకు ఉపయోగించుకోవచ్చు. అవేంటో చూద్దాం..

పెరుగు పుల్లగా అయినంత మాత్రాన అది పాడైపోయినట్లు కాదు. ఎక్కువగా పులిసిపోవడం వల్ల అందులోని ప్రొబయాటిక్ శాతం పెరుగుతుంది. అయితే ఈ పుల్లటి పెరుగులో కూడా మంచి బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్, విటమిన్ డితో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు, మొక్కలకు వివిధ రకాలుగా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఈసారి పెరుగు పులిసిపోయినప్పుడు ఇలా చేయడం మరిచిపోకండి.
రుచికరమైన కూర చేయొచ్చు..
పులిసిపోయిన పెరుగును కూరల్లో లేదా బోండాలకు వాడుకుంటే భలే రుచిగా ఉంటుంది. బోండాల్లో పుల్లటి పెరుగు వాడటం ద్వారా మంచి ఉబ్బుతూ, రుచికరంగా వస్తాయి.
పూజా సామగ్రి శుభ్రం చేయొచ్చు
పుల్లటి పెరుగును తినలేకపోతే అందులో కొంచెం నిమ్మరసం కలిపి పూజ గదిలోని రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని పాత్రలకు పూసి కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత స్క్రబర్‌తో సామగ్రిని తోమినట్లయితే తలాతలా మెరుస్తాయి.

తలకు దివ్య ఔషధం
పులిసిన పెరుగును పొడి జుట్టుపై పట్టించడం ద్వారా చుండ్రు సమస్యను నివారిస్తుంది. కురులను సాఫ్ట్‌గా, హెల్తీగా మారుస్తుంది. మీకు చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే పెరుగులో కొంచెం నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యకరమైన, బలమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.
మొక్కలకు మంచి ఎరువు..
పులిసిపోయిన పెరుగును బాగా గిలక్కొట్టి దానిని నాలుగు రెట్ల వరకు నీళ్లు కలపండి. దీనిని మొక్కలకు ఎరువుగా పోయడం ద్వారా పచ్చగా, ఏపుగా పెరుగుతాయి. క్రిమికీటకాలు పట్టకుండా కాపాడుతుంది. తరచుగా ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.
బ్యూటీ కోసం
పుల్లటి పెరుగును ముఖానికి మసాజ్ చేస్తూ రాసినట్లయితే డెత్ స్కిన్‌సెల్స్ తొలగిపోతాయి. చర్మం, కాంతివంతంగా మెరుస్తుంది. సాఫ్ట్‌గా అవుతుంది. చర్మ సంరక్షణలో పెరుగు బాగా పనిచేస్తుంది. ఇందులో తేనె, పసుపు, శనగపిండి కలిపి ఫేస్‌ప్యాక్‌లా ఉపయోగిస్తే సహజ నిగారింపు మీ సొంతం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
