Latest Updates
-
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!
ఈ గంజి తాగితే..కడుపులో విషపదార్ధాలన్నీబయటకి,ఈజీగా బరువు తగ్గొచ్చు..ఎలా చేసుకోవాలంటే
ప్రస్తుతం బరువు పెరగడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు మనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కఠినమైన వ్యాయామాలు, ఖరీదైన డైట్ లు అంటూ ఎన్నో దారులు వెతుకుతాం. అయితే మన వంటింట్లోనే దాగి ఉన్న ఒక అద్భుతమైన పరిష్కారం గురించి మీకు తెలుసా? అదే మునగాకు గంజి. ఇది కేవలం బరువు తగ్గించడానికే కాదు, శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఒక శక్తివంతమైన పానీయం.
ఆకుకూరల రారాజుగా పిలవబడే మునగాకు పోషకాల గని. దీనిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా, ఉదయం పూట ఈ మునగాకు గంజిని తాగితే శరీరంలోని విషపదార్థాలు (చెడు నీరు), పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతాయి. జీవక్రియ రేటు పెరిగి, బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. వారానికి కనీసం మూడుసార్లు ఈ గంజిని తీసుకుంటే మీ శరీరంలో తేడాను మీరే గమనిస్తారు. ఈ గంజిని తయారు చేయడం చాలా సులభం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపి ఇది. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ మునగాకు గంజిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

మునగాకు గంజి తయారీకి కావలసిన పదార్థాలు
-బియ్యం - 1 కప్పు
-పెసరపప్పు - 1/4 కప్పు
-తాజా మునగాకు - ఒక పెద్ద గుప్పెడు
-జీలకర్ర - 1 టీస్పూన్
-మిరియాలు - 1/2 టీస్పూన్
-మెంతులు - 1/4 టీస్పూన్
-చిన్న ఉల్లిపాయలు - 4
-నీరు - 5 కప్పులు
-ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పెసరపప్పు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి.
-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి నానబెట్టిన బియ్యం, వేయించిన పెసరపప్పును అందులో వేయాలి. ఇందులోనే శుభ్రం చేసుకున్న మునగాకులు, జీలకర్ర, దంచిన మిరియాలు, మెంతులు, చిన్న ఉల్లిపాయలు వేయాలి. ఐదు కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించాలి.
-ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఒక గరిటతో మెత్తగా కలుపుకోవాలి. గంజి మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడినీళ్ళు పోసి కావలసిన విధంగా పల్చగా చేసుకోవచ్చు. అంతే వేడివేడి మునగాకు గంజి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
