Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్!
రోడ్డు మీద బండిపై పానీ పూరీ కనిపిస్తే చాలు.. నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఆ గుమగుమలాడే వాసన చూసి తినకుండా ఉండటం ఎవరి తరం కాదు. అందులోనూ మహిళలు, అమ్మాయిలకైతే పానీ పూరీ అంటే ప్రాణం అంటూ తరచూ సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తుంటాయి. కరకరలాడే పూరీలో కమ్మటి ఆలు మసాలా, ఘాటైన పుదీనా నీళ్లు కలుపుకుని తింటుంటే వచ్చే మజానే వేరు.

అయితే బయట బండ్ల మీద తినేటప్పుడు చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది. అదే పరిశుభ్రత. వాళ్లు వాడే నీళ్లు మంచివేనా? చేతులు శుభ్రంగా కడుక్కున్నారా? దుమ్ము పడుతుందా? ఇలాంటి ఎన్నో భయాలతో ఆరోగ్యం పాడవుతుందన్న ఆందోళనతో.. ఇష్టం ఉన్నాసరే కొందరు పానీ పూరీకి దూరంగా ఉంటారు. పోనీ బయట తినడం ఎందుకని, ఇంట్లోనే ఆ కరకరలాడే గోల్ గప్పాలను తయారు చేసుకుందాం అని ప్రయత్నిస్తే, ఎన్నో ఇబ్బందులు. పిండి సరిగ్గా రాకపోవడం, నూనెలో వేయగానే అవి ఉబ్బకపోవడం, అప్పడాల్లా మారిపోవడం జరుగుతుంటాయి. అంతేకాకుండా వాటిని డీప్ ఫ్రై చేయడం వల్ల పూరీలు చాలా జిడ్డుగా మారుతాయి.
కానీ డీప్ ఫ్రై చేయకుండా, లీటర్ల కొద్దీ నూనె వాడకుండా, ఎంతో ఆరోగ్యకరంగా పానీ పూరీలను తయారు చేసే ఒక అద్భుతమైన చిట్కా ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. కేవలం ఒకే ఒక్క టీస్పూన్ నూనెతో, అచ్చం బండి మీద దొరికేలా గుండ్రంగా ఉబ్బిన పానీ పూరీలను ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కుక్కర్ లో పానీ పూరీలను తయారు చేసే విధానం
పిండి తయారీ: ముందుగా సాధారణంగా పానీ పూరీ కోసం ఎలాగైతే రవ్వ, మైదాతో కలుపుకుంటామో.. అలాగే సరైన కొలతలతో పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండి గట్టిపడేందుకు కాసేపు మూతపెట్టి పక్కన పెట్టాలి.
పూరీలు ఒత్తడం: ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, పలుచగా పూరీల్లా ఒత్తుకోవాలి.
కుక్కర్ సిద్ధం చేయడం: ఇప్పుడు ఒక మందపాటి ప్రెషర్ కుక్కర్ తీసుకుని, అడుగు భాగాన కేవలం ఒక స్పూన్ నూనె వేసి సమానంగా రాయాలి.
పూరీలు పేర్చడం: మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న 10 నుంచి 15 పూరీలను కుక్కర్ అడుగున ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా పేర్చాలి. వాటి పైన కూడా బ్రష్ తో కొద్దిగా నూనెను అప్లై చేయాలి.
వండే విధానం: ఇప్పుడు కుక్కర్ మూతకు ఉన్న విజిల్ (వెయిట్) తీసేసి మూత పెట్టేయాలి. దీనిని స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. సరిగ్గా 5 నిమిషాల లోపు స్టవ్ ఆఫ్ చేసి, మూత తెరిచి చూడండి. అంతే మీరు నమ్మలేనంత అద్భుతంగా, నూనెలో వేయించినట్లే గుండ్రంగా, బంతిలా పొంగిన కరకరలాడే పానీ పూరీలు రెడీగా ఉంటాయి.
ఈ అద్భుతమైన చిట్కాతో కేవలం ఒకే ఒక్క స్పూన్ నూనెతో ఎంతో ఆరోగ్యకరమైన పానీ పూరీలను ఇంట్లోనే ఆస్వాదించవచ్చు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications