Latest Updates
-
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.!
చుక్క నూనె లేకుండా ..రెండేళ్ల పాటు నిల్వ ఉండే టేస్టీ మామిడికాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
తెలుగు వారి భోజనం పచ్చడి లేకుండా అసలు పూర్తి కాదు. కానీ పచ్చడి అనగానే అందులో వాడే లీటర్ల కొద్దీ నూనె గుర్తుకొచ్చి, బరువు పెరుగుతామనో లేదా కొలెస్ట్రాల్ వస్తుందనో ఆరోగ్య స్పృహ ఉన్నవారు పచ్చళ్లకు దూరంగా ఉంటుంటారు. అయితే చుక్క నూనె లేకుండా, నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా తగిలే జీరో ఆయిల్ మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా?
నూనె లేకుండా చేసే ఈ పచ్చడి పొట్టకు చాలా తేలికగా ఉంటుంది, మీ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పైగా ఏళ్ల తరబడి నిల్వ ఉంటుంది. చుక్క నూనె లేకుండా రెండేళ్ల పాటు నిల్వ ఉండే పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

నూనె లేని పచ్చి మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సినవి
పచ్చి మామిడికాయలు - 5 కిలోలు
ఉప్పు - 200 గ్రాములు
కశ్మీరీ ఎర్ర కారం పొడి - 100 గ్రాములు
ఇంగువ - 10 గ్రాములు
పసుపు - 1 టీస్పూన్
నూనె లేని పచ్చి మామిడికాయ పచ్చడి తయారీ విధానం
-ముందుగా పచ్చి మామిడికాయలను నీళ్లలో శుభ్రంగా కడగాలి. వాటిపై తడి ఏమాత్రం లేకుండా పొడి వస్త్రంతో తుడిచి గాలికి పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
-తడి ఆరిన మామిడికాయల చెక్కు తీసి, మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్లో 200 గ్రాముల ఉప్పు వేసి, ముక్కలన్నింటికీ ఉప్పు బాగా పట్టేలా కలపాలి. ఉప్పు కలిపిన మామిడి ముక్కలపై మూత పెట్టి, సుమారు 24 గంటల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల మామిడికాయల్లోని సహజమైన నీరు (ఊట) బయటకు వస్తుంది.
-24 గంటల తర్వాత ముక్కల నుండి ఊరిన నీటిని ఒక పొడి గాజు సీసాలోకి వడకట్టి భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కలను మాత్రం ఎండలో 3 గంటల పాటు ఆరబెట్టాలి.
-పక్కన పెట్టుకున్న మామిడి ఊట (నీరు) నుండి ఒక కప్పు తీసుకుని, అందులో 10 గ్రాముల స్వచ్ఛమైన ఇంగువ వేసి పూర్తిగా కరిగేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు కొద్దిగా ఎండిన మామిడి ముక్కలను ఒక పెద్ద బౌల్ లోకి తీసుకుని, అందులో పసుపు, కాశ్మీరీ కారం పొడి, ముందుగా రెడీ చేసుకున్న ఇంగువ ద్రావణాన్ని వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి.
-ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన, తడిలేని గాజు సీసాలో పెట్టుకోవాలి. ముందుగా మిగిలి ఉన్న మామిడికాయ ఊటను ఆ ముక్కల పైన పోయాలి.
-గాలి చొరబడకుండా సీసా మూతను గట్టిగా బిగించి, ఇంట్లో చల్లగా ఉండే
ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.
అంతే ఎంతో గుమగుమలాడే జీరో ఆయిల్ మామిడికాయ పచ్చడి రెడీ. ఇది మీ ప్రతి
భోజనానికి అద్భుతమైన రుచిని జోడిస్తుంది.
-ఈ పచ్చడిని గాజు సీసాలో సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే, సుమారు 2 నుంచి 3 సంవత్సరాల పాటు ఏమాత్రం రుచి, రంగు చెడిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
