చుక్క నూనె లేకుండా వెజిటబుల్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా, రుచిగా తయారు చేసుకోండిలా

Posted By:

రోజువారీ భోజనంలో నూనె వాడకాన్ని తగ్గించాలనుకునే వారికి నూనె లేని వెజిటబుల్ పులావ్ బెస్ట్ ఆప్షన్. క్యారెట్లు, బీన్స్, క్యాలీఫ్లవర్‌తో రంగురంగులుగా ఉండే ఈ వంటకం కుటుంబంతో కలిసి మధ్యాహ్న లేదా రాత్రి భోజనానికి చక్కగా సరిపోతుంది. ఇందులో వాడే కొద్దిపాటి పాలు అన్నానికి తేలికపాటి క్రీమీ రుచినిస్తే, నిండు మసాలాలు కమ్మని సువాసనను జోడిస్తాయి. సుమారు 40 నుండి 50 నిమిషాల్లో నలుగురికి సరిపడా ఈ పులావ్‌ ను సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

-రెండు కప్పుల బాస్మతి బియ్యం
-అర కప్పు తరిగిన బీన్స్
-రెండు చిన్న క్యారెట్లు
-అర కప్పు క్యాలీఫ్లవర్ పువ్వులు
-ముప్పావు కప్పు పాలు
-రెండు బిర్యానీ ఆకులు
-రెండు మూడు లవంగాలు
-ఐదు నల్ల మిరియాలు
-అంగుళం దాల్చినచెక్క
-మూడు నాలుగు చిన్న యాలకులు
-చిటికెడు తురిమిన జాజికాయ
-అర టీస్పూన్ పసుపు
-అర టీస్పూన్ ఎండు కారం
-అర టీస్పూన్ గరం మసాలా
-రుచికి సరిపడా ఉప్పు
-చిటికెడు పంచదార
-కొన్ని జీడిపప్పులు
-కొత్తిమీర ఆకులు

Zero Oil Vegetable Pulao Recipe in Telugu Delicious One Pot Meal with Carrots Beans Cauliflower

తయారీ విధానం

-ముందుగా బియ్యాన్ని రెండు మూడు సార్లు మెల్లగా కడిగి, 20 నుండి 30 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత నీటిని వడకట్టండి. ఈలోగా క్యారెట్లు, బీన్స్‌ ను సమాన పరిమాణంలో తరిగి, క్యాలీఫ్లవర్‌ ను చిన్న పువ్వులుగా కడిగి నీరు వడకట్టి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌ లో సగం పాలు పోసి తక్కువ మంటపై వేడి చేయండి. అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క, దంచిన యాలకులు, జాజికాయ వేసి పాలు మరిగించకుండా సువాసన వచ్చేవరకు నెమ్మదిగా ఉడకనివ్వండి. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ వేసి పాలలో మెల్లగా కలపండి. నూనె లేదు కాబట్టి అడుగున పాలు అంటుకోకుండా మంటను గమనిస్తూ ఉండాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కావాలంటే పంచదార, జీడిపప్పు వేసి ఒకటి రెండు నిమిషాలు కలియబెట్టండి.

విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు!

-ఇప్పుడు నీరు వడకట్టిన బియ్యాన్ని వేసి గింజలు విరిగిపోకుండా వెడల్పాటి గరిటెతో కింది నుండి పైకి మెల్లగా కలపండి. పాలు ఆరిపోయే వరకు ఆగకుండా, వెంటనే మిగిలిన పాలు, సుమారు రెండున్నర కప్పుల నీరు పోయండి. ఒకసారి మెల్లగా కలిపి కుక్కర్ మూత పెట్టండి. మీడియం మంటపై ఒక్క విజిల్ వచ్చేవరకు ఉడికించి, స్టవ్ ఆపేసి ప్రెషర్ సహజంగా పోయేవరకు వదిలేయండి.

-కుక్కర్ మూత తెరిచిన వెంటనే అన్నాన్ని కలపకుండా ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ఫోర్క్ లేదా వెడల్పాటి గరిటెతో అంచుల నుండి అన్నాన్ని మెల్లగా పైకి లేపితే మెతుకులు విరగకుండా పొడిపొడిగా, మెత్తగా వస్తుంది.

-చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా దోసకాయ రైతా లేదా సాదా పెరుగుతో వడ్డించండి.

[ of 5 - Users]
Story first published: Friday, November 20, 2026, 20:41 [IST]
Desktop Bottom Promotion