Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో....!

30 సంవత్సరాల వైవాహిక జీవనంలో జంటల మార్పు ఎలా?
సమయం - ఎంత బిజీగా వున్నప్పటికి జంటలు ఒకరితో ఒకరు డిన్నర్ తర్వాతైనా సరే సమయం గడపటానికి చూస్తారు. రిలాక్స్ అవటానికి ఇది మంచి సమయం. టెలివిజన్ కూడా వుంటుంది. రోజంతా ఎన్నో పనులు చేసుకుంటారు. ఇద్దరూ ఖాళీగా వుండే సమయం ఇదే. స్వేచ్ఛా సమయంపై ఒక అంచనా కలిగి వుండండి. మీరు మీ భాగస్వామిని ఇంకా ఇష్టపడుతున్నట్లు తెలుపండి.
ఆసక్తి - పెళ్ళి అయిన కొత్తలో ఎలా వున్నారో ఇప్పటికి మీ భాగస్వామిపై అదే ఆసక్తి చూపండి. సమయం మారిపోతూంటుంది. కాని ఆశయాలు, ఆశలు ఎప్పటకి మారవు. అణగిపోవు. మీ భాగస్వామి ఇంకా తనపట్ల ఆసక్తి ప్రదర్శించాలనుకుంటాడు. ఎంత బిజీగా , ఒత్తిడిగా వున్నప్పటికి మీ భార్య మాట్లాడేటపుడు ఆసక్తి చూపండి. ఆమె చెప్పే అనవసరపు మాటల్లో కూడా, లేదా ప్రేమ సంభాషణల్లో మీకుగల ఆసక్తి చూపండి. కేశ సౌందర్యం పొగడండి. మరి భార్య అతని కొత్త షర్టు లేదా టై బాగుందనవచ్చు.
ఆకస్మిక బహుమతులు - జంటలకు సర్ ప్రైజెస్ కావాలి. అపుడే రొమాన్స్ కు అర్ధం వుంటుంది. అది రెగ్యులర్ గా చేయరాదు. ఎపుడో ఒకసారి ఆకస్మిక బహుమతి ఇవ్వండి. ఒక గులాబి లేదా పూలచెండు ఎంతో మార్పు నిస్తుంది. 30 సంవత్సరాల తర్వాత ఆమె మీనుండి పెళ్ళినాటి ఆశింపులు ఆశించదు. మరి పోయిన రొమాన్స్ తిరిగి మీరిస్తే ఆమె సంతోషపడుతుంది. ఏదో ఒక సందర్భంలో ఇచ్చే ఈ బహుమతులు ఫలితాలనిస్తాయి.
ప్రేమ - వివాహమై ముఫ్పై సంవత్సరాలు గడిచినప్పటికి ప్రేమ ఒక ఆశింపుగానే వుంటుంది. మీ డార్లింగ్ మొదటిలో మీరు ప్రేమించినట్లే ప్రేమించాలని కోరుతుంది. మీ 30 సంవత్సరాల జీవితంలో మీ ప్రేమ పెరిగే వుంటుంది. కాని మీరు చేయవలసిందల్లా దానిని వెలిబుచ్చటమే.
30 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత జంటలు కోరే కోరికలు ఇవే. క్రమేణా రిటైర్ మెంట్ వయసు వచ్చే సరికి మీకు మీ భాగస్వామితో గడపటానికి మరింత సమయం దొరుకుతుంది. ఆరకంగా ప్రణాళిక చేసి మీరు నెలలు సంవత్సరాలు గడిపేయండి.



Click it and Unblock the Notifications
