Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
గురకల వీరుడు - గతిలేని అమ్మడు!

మీ భాగస్వామి మంచివాడై వుండచ్చు. బాగా డబ్బున్నవాడై వుండవచ్చు. కాని రాత్రులందు మీకు నిద్రాభంగం చేస్తూ పెద్దగా గురకలు పెట్టేస్తుంటే భరించటం కష్టమే. నిద్ర సరిగా లేకుంటే మైండ్ ఒత్తిడికి గురవుతుంది. వ్యతిరేకత పెరిగి జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. గురక జంటల శారీరక సంబంధాలను కూడా దూరం చేస్తుంది. గురక వింటే చాలు ఇక నిద్ర మూడ్ పారిపోతుందని చెప్పే వారు చాలామందే వున్నారు. మరి ఒకరి పక్కన మరొకరు నిద్రించని జీవిత భాగస్వాములకు అనుబంధం కూడా లోపిస్తుంది. క్రమేణా వేరు పడటం, తదనంతరం విడాకులు వంటివి కూడా ఏర్పడతాయి.
మరి ఈ బంధాలు విడవడకుండా ఎలా కాపాడాలి? గురక వీరులను ఎలా మీకు అనుకూలం చేసుకోవాలి అనే దానికి కొన్ని చిట్కాలు చూడండి.
1. పక్కలో పడి గుర్రు పెట్టేసేవారిని, గురక సమయంలో గిచ్చండి, లేదా గట్టిగా తన్నండి. అవసరమైతే పడుకునే భంగిమను మీరే మార్చేయండి.
2. అతను రాత్రి డిన్నర్ త్వరగా తినేలా చూడండి. పాలు తాగేవారైతే, పాలు ఇవ్వకండి. వెన్న, కొవ్వు వుండే పదార్ధాలు ఫ్లెమ్ ఏర్పరచి ముక్కు దిబ్బడ కలిగి శబ్దం చేయిస్తాయి.
3. గురకలో పక్కవారికిగల అసౌకర్యం అతనికి వివరించండి. గురక నిరోధక చర్యలు కఠినంగా ఆచరించమనండి. తేలికగా సమస్యను తీసేయటం సమస్యకు పరిష్కారం కాదు. అలాగని అతనిని విసిగించవద్దు. అతను చేసేదేమి పెద్ద తప్పు కాదు.
4. పొగ తాగటం, ఇతర చెడు అలవాట్లు ఏవైనావుంటే అవి మాన్పించండి. సమస్య కొంతమేరకు తీరినట్లే. శబ్దం మీ వైపుకు రాకుండా వెల్లకిలా పడుకునేలా చేయండి.
అతనికున్న అలవాట్లు ఆరోగ్యకరమైనవి కావని అవి గురక తెప్పిస్తున్నాయని దాని వలన మీ జీవితం కూడా అసౌకర్యానికి గురవుతోందని తెలుపండి. అతను గ్రహించి మీ చిట్కాలను తప్పక పాటిస్తాడు. ముక్కు రంధ్రాలలో గురక నిలపటానికి వేసే చుక్కలు కొంతమేరకు గురక తగ్గించవచ్చు.



Click it and Unblock the Notifications
