Latest Updates
-
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
జంటల పోట్లాటలు... గెలుపుల ఆరాటాలు!

జంటలు పోట్లాడుకుంటే....
1. దొంగప్రేమ నటిస్తారు - ఇంట్లో ఒకరి కొకరు చీరేసుకున్నా, బయట పార్టీ వంటి ఫంక్షన్స్ కు వచ్చినపుడు దొంగప్రేమాలు ఒలక పోస్తారు. ముఖంపై చిరునవ్వులు కళ్ళలో తిరస్కారాలు కనపడుతూంటయి. వారిలోని కోపాన్ని కవర్ చేసుకోటానికి చూస్తూంటారు.
2. ఒకరంటే మరి ఒకరికి తెలియనట్టు నటిస్తారు - కోపం అధికంగా వుంటే, ఒకరంటే మరి ఒకరు పూర్తిగా తెలియనట్లుంటారు. మాల్స్, ధియేటర్లు వంటి వాటిలో కొన్ని జంటలు దూరంగా నడవటం గమనిస్తూనే వుంటాం. వాస్తవానికి వారు ఒకే కారు ఎక్కే వరకు జంట అనుకోము.
3. స్నేహితుడి ఇంట్లో దిగటం - మీ ఫ్రెండ్ కనుక పక్కన తన భార్య లేకుండా రాత్రి 8 గంటలకు మీ ఇంటికి వచ్చాడనుకోండి. అతను ఇంట్లో పోట్లాడి వచ్చాడని భావించవచ్చు. జంటలు పోట్లాడుకుంటే, ఒకరినొకరు తప్పించుకుంటూ స్నేహితుల ఆశ్రయం తీసుకుంటారు.
4. మంచంపై ఒకే దిండు కనపడితే.... మంచంపై ఒకేదిండు, దూరంగా నేలపై మరో దిండూ కనపడ్డాయంటే ఆ జంట తప్పక ఫైట్ చేశారనే భావించాలి.
5. జంటలు ఫైట్ చేసుకుంటే...ఇక వారు మాట్లాడుకోనంత కాలం పాపం, వారి పిల్లలకు కొరియర్ ఉద్యోగం తప్పదు. పిల్లాడు వారిద్దరి మధ్య మాటలు చేరేస్తూంటాడు. లేదా నిలబడి వారిమాటలు అరుస్తూంటాడు.
జంటలకు పోట్లాడుకోవటం సాధారణమే. అయితే అది వారు నలుగురి ఎదుట కప్పి పుచ్చుకోవాలనుకున్నప్పటికి బయట పడుతూనే వుంటుంది. మీకు ఈ వ్యవహారాలలో మరిన్ని లక్షణాలు కనపడితే తప్పక మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications
