Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పేదవానితో ప్రేమలో పడకు పిల్లా?

‘‘బెంగుళూరులోని ధనికులు నివాసముండే ప్రదేశంలో నేను నివసిస్తూ ఉండేదాన్ని. నా తల్లితండ్రులు బ్యాంక్ ఉద్యోగులు. ఎల్లపుడూ బిజీగా వుండేవారు. నేను చెప్పే ఈ కధ నా తెలివితక్కువ తనానికి నిదర్శనంగా వుంటుంది. అప్పటి నానిర్ణయాలకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. నా ఈ కధ మూలంగా యువతులందరకు కనువిప్పు కలగాలని వారు గుడ్డిగా ప్రేమలో పడరాదని కోరుకుంటున్నా. ప్రత్యేకించి కాలేజీలకు వెళ్ళే యువతులు దీనిని చదివి నేర్చుకోవాలని భావిస్తున్నా.
ప్రేమకు డబ్బు అవసరంలేదు అనే మాట సరికాదు. అసలు డబ్బు లేకుండా ప్రేమనేది లేదు. రాజా అనబడే ఒక సెకండ్ సెమిస్టర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధి మాకు పక్కఇంటివాడుగా వుండేవాడు. అతను తన స్నేహితులతో వుండేవాడు. మా సోదరుడికి కూడా స్నేహితుడుగా వుండేవాడు.
ఎన్నో సార్లు మా ఇంటికి వస్తూ మా కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. ఒకసారి తాను కోల్ కత్తా నుండి వచ్చానని స్టడీస్ అయిన తర్వాత తిరిగి తన స్వంత ఊరుకు వెళతానని తెలిపాడు. కొద్ది రోజుల తర్వాత మేము మా టెలిఫోన్ నెంబర్లు ఒకరికొకరం ఇచ్చుకున్నాం. అంతేకాదు, ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకుంటూ వుండే వారం.
నేను అతనంటే ఎంతోఇష్టపడ్డాను. అతని స్టడీస్ తర్వాత పెళ్ళి చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాను. నేను ఆ విషయం ప్రపోజ్ చేసినపుడు అతని కళ్ళలో ఏ మాత్రం ఉత్సాహం చూడలేకపోయాను. అతను ఒక పేద కుటుంబంనుండి వచ్చానని ఉత్తమ జీవన విధానాలకు తాను తగినవాడిని కానని అనేవాడు. అయితే, నేను వర్రీ అవుతున్నప్పటికి నా కొత్త జీవన విధానానికిసరిపోతావు అంటూ నేనే ఎంతో అతనిని ఉత్సాహపరిచాను.
నెలలు గడిచాయి. నా తల్లితండ్రులు నాకు ఒక దూరపు బంధువుతో వివాహాం నిర్ణయించారు. నేనెంతో భయపడి వారికి వాస్తవాన్ని తెలిపాను. నా తల్లితండ్రులు ఎంతో కోపం తెచ్చుకున్నారు. అతను మన కుటుంబ హోదాకు, కులానికి తగిన వాడు కాదని అరిచారు. అతడిని ఇంటికి పిలిపించి బెంగుళూరు వదిలి వెళ్ళిపొమ్మని బెదిరించారు.
అదే రోజు రాత్రి నేను రాజాను ఒక కిరాణం షాపు వద్ద కలిశాను. అతను బెంగుళూరు నుండి వెళుతున్నట్లు తెలిపాడు. నేను కూడా అతనితో వచ్చేస్తానని అడిగాను. అంతే...బెంగుళూరు నుండి ఇద్దరం పారిపోయాం. ఎంతో హేపీ గా భావించాం. అప్పటివరకు మా ప్రేమ కధ ఒక సినిమా ప్రేమ కధగా నడిచింది.
ట్రైన్ లో మేకు కలకత్తా చేరుకున్నాం. అతను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. అతను నివాసం ఉండే ప్రదేశం చూసి నాకు షాక్ అయ్యింది. అది ఒక స్లమ్. అతని ఇంటికి తలుపులు, గోడలవంటివి కూడా లేవు. నేను బట్టలు మార్చుకోడానికి కూడా గతిలేదు. బాత్ రూమ్ లేదా టాయ్ లెట్ వంటివి ఏవీ లేవు. టాయి లెట్ కు వెళ్ళాలంటే క్యూ లో నిలబడాలి.
ఆ ప్రదేశంలోని పురుషులు నాతో తప్పుగా ప్రవర్తించేవారు. అతను నాకు ఒక జత దుస్తులు కూడా కొనిపెట్టలేని పరిస్ధితి. నేను నా శరీరాన్ని కప్పుకోడానికి గాను అతని లుంగి కట్టుకోవలసి వచ్చింది. ఆ మూడు నెలలు అక్కడ నేను నరకం చూశాను. అతని తల్లి నన్ను ఒక పనిమనిషిగా భావించి రోజంతా కష్టపెట్టేది. ఆమె నన్ను ఒక బార్బర్ షాపు యజమానికి అమ్మేయాలని కూడా ప్రయత్నించింది. నేను త్వరపడి తీసుకున్న నిర్ణయానికి నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.
సరిగ్గా అపుడే, నా తల్లితండ్రులు బెంగుళూరు పోలీసులను వెంటపెట్టుకు వచ్చారు. నన్ను మరల నా ఇంటికి తీసుకు వచ్చారు. నా తండ్రిని చూడాలంటే చచ్చేంత భయం వేసింది. కాని ఆయన ఏమీ నన్ను ప్రశ్నించలేదు. ఆయన నన్ను మా స్వంత ఊరుకు పంపారు. అక్కడ విద్య నేర్పించారు. నేటిరోజున, నేను ఒక పెద్ద ఇంజనీర్ ని. ఆస్ట్రేలియాలో ఎం.ఎస్ చేసిన అరవింద్ అనే యువకుడిని పెళ్ళాడాను. మేము ఆనందంగా ఇపుడు మెల్ బోర్న్ లో స్ధిరపడ్డాము. జీవితం ఆనందంగా సాగిపోతోంది. స్వర్గంలో వున్నట్లు భావిస్తున్నాను.
నన్ను ఆ నరక కూపంనుండి బయటపడేసి కొత్త జీవితాన్ని ప్రసాదించిన నా తల్లితండ్రులకు, భగవంతుడికి నా కృతజ్ఞతలు.



Click it and Unblock the Notifications
