Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
విడాకులనుండి కాపాడే హాస్యపు జల్లులు!

1. నేటి రోజుల్లో చాలామంది జంటలు వారి సంబంధాలలో విసిగిపోయామని చెపుతూంటారు. వివాదాలకు ఇదే కారణం. అంటే వివాహ జీవితంలో హాస్యం కరువైందని అర్ధం. మరి కొద్దిపాటి నవ్వులతో మీ భాగస్వామిని కట్టిపడేయవచ్చు.
2. మరింత వివాదంగా వుందా? ఒకరి ముఖం మరొకరు చూసుకోని పరిస్ధితి కూడా వచ్చేసిందా? అయినప్పటికి మీ మధ్య టెన్షన్ తగ్గాలంటే నవ్వు తెప్పించే మాటలు, సంఘటనలే కావాలని గుర్తుంచుకోండి. మీ పోట్లాటలు ఎంత మూర్ఖం అయినప్పటికి, మీ మధ్య ఎంత టెన్షన్ కలిగించినప్పటికి వాటిని చూసి ఇద్దరూ నవ్వేయండి. వివాదాలు సమసిపోతాయి.
3. అయితే, అకస్మాత్తుగా మీరు నవ్వుల జల్లులు కురిపించలేరు. అలా చేస్తే అది మీ భాగస్వామికి కృత్రిమంగా వుంటుంది. మెల్లగా మొదలుపెట్టండి. ప్రాక్టికల్ జోక్ వేయండి. అది హస్యం గా, నవ్వు తెప్పించేదిగా వుండాలి. గతంలో ఎన్నడూ లేని చిన్న సంఘటనగా వుండాలి?
4. ఇద్దరు కలసి నవ్వు తెప్పించే కామెడీ షోలు చూడండి. వర్కవుట్ అవుతుంది. ఆ సన్నివేశాలు మిమ్మల్ని ఎంత దగ్గరగా తీసుకు వెళతాయో అంచనా వేయలేము.
5. ఈ రోజుల్లో వివాహ జీవిత తగాదాలు, విడాకులు వంటివన్నీ మన పని జీవితం నుండి కూడా పుట్టుకువస్తున్నాయి. ఎంతో కష్టపడి చికాకుతో ఇంటికి రావటం ఒకరిపై మరిఒకరు విసుక్కోవడం జరుగుతోంది. అవి పెద్దవై పోట్లాటలుగా పరిణమిస్తున్నాయి. అలా ఒకరిపై మరిఒకరు విసుక్కునేకంటే, మంచి కామెడీ సీన్లు చూసి అద్భుతంగా నవ్వేసుకోండి. అంతేకాదు, ఆఫీసుల్లో బాసులగురించి వ్యాఖ్యానించుకుంటూ కూడా నవ్వేసుకోవచ్చు. అయితే ఎవరి బాస్ గొప్ప ...అని సీరియస్ అవకండి.
మరి మీ మంచి సంబంధాల నిర్వహణలో హాస్యపు జల్లులు కురిపించి మీ వివాహ జీవితాన్ని ఆనందించేయండి. విడాకులు, వేర్పాటులు వంటివాటినుండి రక్షించుకోండి.



Click it and Unblock the Notifications
