Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మీ వదిన లేదా ఆడపడుచులతో సమస్యా...?

వదినా మరదళ్ళలో రకాలెలావుంటారు?
ఈ వదినలు, ఆడపడుచులు రెండు రకాలుగా వుంటారు. ఒక రకంఎంతో సహకరించేవారు మరో రకం ఎంత చిన్న అంశమైనా సరే దానిపై పెద్దగా తగవులాడేవారు. మీరు కనుక అదృష్టవంతులైతే, మొదటి రకం వారు మీకు దొరుకుతారు. కాని అది అరుదుగా జరిగేదే. అసలు ఈ ఆడపడుచులు మీ వివాహజీవితంలో ఎందుకు సమస్యలు కలిగిస్తారు? ఆమె కుటుంబ సభ్యులనుండి మీరు అధికంగా ప్రేమను పొందుతున్నారనే అసూయ వారికుంటుంది. ఆమెకు ఇవ్వకుండా మీ భర్త ఏదైనా విలువైన వస్తువును మీకు ఇస్తే చాలు సహించలేరు. తమ సోదర సంబంధాలమధ్య మీరు అడ్డంకిగా భావిస్తుంది. కనుక మీరు ఎంతో చాక చక్యంగా మీ భర్తకు కూడా సమస్య లేకుండా ఆమెతో నిర్వహించాలి.
సమస్యలను తేలికగా ఎలా పరిష్కరించాలి? ఎల్లపుడూ తగవులాడే ఆడపడుచులు, వదిన గార్లతో తియ్యటి కత్తిలా వుండి పైకి బాగా మాట్లాడుతూనే వ్యతిరేకించాలి. మంచిగా మాట్లాడి ఆమెను వ్యతిరేకిస్తూ వుండండి. మీకు అసలు ఆమెతో సమస్య లేనట్లు వుండండి. మీ పరిస్ధితి మీ భర్త తప్పక సమర్ధిస్తాడు. మొదటగా మీ భర్త ఇతర కుటుంబ సభ్యుల కళ్ళల్లో మీరు మంచివారిగా వుండండి. ఆ రకంగా ప్రవర్తించే మీ తీరు మీకు మీ వదిన లేదా ఆడపడుచులకు మధ్య వచ్చే ఎటువంటి సమస్యకైనా సరే మీకు అనుకూలంగా వుంటుంది.
పావులు కదపండి -వివాహం తర్వాత కుటుంబ జీవితం చెస్ ఆట వంటిది. తెలివిగా వేసే మీ ఎత్తులు మీ గెలుపు, ఓటములను నిర్ణయిస్తాయి. మీరు గెలవటానికిగాను ఎప్పటికపుడు పావులు కదపండి. మీ ఆడపడుచు లేదా వదిన మీ సమర్ధత ఏమిటో గ్రహిస్తుంది. మీ జోలికి రాకుండా వుంటుంది. వాస్తవం ఎంత కఠినమైనప్పటికి అది వెలుగులోకి వస్తుంది. ప్రతిదీ మీకు లాభ సాటిగా చేసుకోవాలంటే మీరే లాఘవంగా వ్యవహరించాలి. మీరు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తే, మీ భర్త, ఇతర కుటుంబ సభ్యుల మధ్య అంత మంచి పేరు తెచ్చుకొని వారి హృదయాలను గెలుచుకుంటారు.
మీకు మీ భర్తకు మధ్య ఏదీ చెడకుండా వుండాలనేది గుర్తుంచుకోండి. ఏ రకంగానైనా సరే ఈ పవిత్ర బంధాన్ని మీరు కాపాడుకోవాలి. లేదా చెడకుండా చూసుకోవాలి. మీరు కనుక మీ వదిన, లేదా ఆడపడుచులతో ఇప్పటికే ఈ సమస్యలు ఎదుర్కొంటూంటే మాకు వ్రాయటం ద్వారా తప్పక పంచుకోండి.



Click it and Unblock the Notifications
