Latest Updates
-
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.!
బొమ్మ చూస్తే హుషార్...భార్యనుచూస్తే పరార్!

కొంతమంది పార్టనర్ మూడ్ ఇవ్వలేకుంటే, అశ్లీల చిత్రాలుచూసి మూడ్ తెచ్చుకొని రతి సాగిస్తారు. బయటకు అది ఉపయోగపడిందని భావిచినప్పటికి అంతర్గతంగా హాని కలిగిస్తుంది. మీరు పడే ఆవేశం లేదా ఉద్రిక్తత మీ పార్టనర్ వలన కాదు. దానిలో సెక్స్ మాత్రమే వుంటుంది కాని, ప్రేమ వుండదు. నేటి రోజులలో సెక్స్ మాత్రమే సంబంధాలమధ్య కొలమానంగా వుంది. ప్రేమకు తావే లేదు. ఆవేశం కొరకు అశ్లీలతలను చూడటం మంచిదనిపించుకోదు. అది ఒక తమాషా అని భావిస్తారు. ఈ రకమైన వ్యక్తికి సెక్స్ అంటే పై పై చర్య మాత్రమే.
చాలామంది ఉద్రేకం కలగాలంటే అశ్లీల చిత్రాలను చూస్తారు. ఇటువంటివారు ఎంతో గట్టిగా ఉద్రేకం కలిగితేగాని సాధారణ సెక్స్ కూడా చేయలేరు. అశ్లీలతా చిత్రాలు చూసేవారు చాలావరకు ప్రతిరోజు సెక్స్ సమస్యలంటూ వైద్య సలహాలకు అధికమైపోతున్నారు. అశ్లీలత ఒక మత్తు కలిగించేది. హస్తమైధునం, తెలియనివారితో సెక్స్, జారిణి తనం, వంటివి ఎన్నో ఈ కోవకే వస్తాయి. ఇవి ఒక వ్యామోహంలో కలిగే సంబంధాలు. చాలామందికి అశ్లీలత అంటే సెక్స్ కోరికలు కలిగి వుండటంగానే తెలుసు.
ఈ అశ్లీల చిత్రాలకు అలవాటు పడినవారు తమ మంచి సంబంధాలను సైతం పాడుచేసుకుంటారు. గంటల తరబడి ఇంటర్నెట్ చూస్తారు. సొమ్ము నష్టపరచుకొంటారు. అశ్లీలత చిత్రాలకు అలవాటు పడిన వారికి అలవాటు, అలవాటనేది నిరంతర అలవాటుగా మారటం, ఎంత చూసినా తనివితీరకపోవటం, దానిని పక్కవారితో అభ్యసించటం అనే దశలకు చేరిపోతారు. అపుడు ఎంత మంచి సంబంధం అయినప్పటికి అది చెడిపోయే అవకాశం వుంటుంది.
అశ్లీల చిత్రాలుచూడటం తమపై తమకు నియంత్రణ లేకపోవటం, అందరూ అంగీకరించే నిబంధనలు అతిక్రమించడం. ఈ రకమైన అలవాటు బాల్యదశలో ఏర్పడితే అది మరింత ప్రమాదకరంగా పెరిగిపోతుంది. బాల్యంలో కుటుంబాలు సరిలేకున్నా ఈ సమస్య వచ్చేస్తుంది. వీటికి అలవాటు పడేవారు బాల్యంలోనే దుర్వినియోగం చేయబడిన వారై కూడా వుంటారు. అశ్లీల చిత్రాలలో సాధారణంగా మహిళలు బలవంతపు సెక్స్ కు ఆనందపడుతున్నట్లు చూపుతారు. అది నేరాలకు దోవతీస్తుంది.
సెక్స్ అనేది ఒక శారీరక చర్య అనుకుంటే బాహ్య స్పందనలు కావాలి. ప్రేమ కొరవడితే మీరు ఎవరిని నిందించలేరు. అటువంటపుడు పార్టనర్లు ఇద్దరూ సంబంధాన్ని పరీక్షించుకోవాలి, తమలో తామువ్యక్తిగతంగా లేదా ఒక మధ్యవవర్తిద్వారా. తరచుగా భార్యలు భర్తను నిందిస్తారు. అయితే, వారికి వారు నా సంబంధం మరింత మెరుగవడానికి నేనేం చేయాలి అని ప్రశ్నించుకుంటూ, సెక్స్ పర సంబంధం కాక హృదయానికి సంబంధించిన స్పందించే సంబంధం కొరకు కృషి చేయాలి.



Click it and Unblock the Notifications
