Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రూమ్ మేట్ తో సంబంధాలు బాగా వుండాలంటే?

శుభ్రత ప్రధానం - శుభ్రత విషయంలో ఎవరికి వారు శ్రద్ధ వహించాలి. రూమ్ లో కామన్ గా వుండే ప్రదేశాలలో చెత్తా చెదారం వంటివి వేయరాదు. ఎవరి దుస్తులు వారు నిర్దేశిత ప్రదేశాలలో వుంచుకోవాలి. రూమ్ అందరికి సంబంధించినదిగా భావించి ఇతరులకు శుభ్రతపట్ల శ్రద్ధ కలిగేలాచేయాలి.
కలహాలు - కొంతమంది అకారణంగా కలహించే వారు కూడా వుంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా వుండాలి. వీలైనంత దూరంగా వుంటూ వారిని మార్చేటందుకు ప్రయత్నించాలి. అన్ని పనులలోను వారి జోక్యం తగదని తగుమాత్రంగా చెప్పి ఎక్కడ వారి అవసరం వుంటుందో అటువంటి పరిస్ధితిలోనే వారికి పనులు చెప్పాలి. లివింగ్ రూమ్ ఎప్పటికపుడు శుభ్రం చేస్తూ అందరికి అనుకూలంగా వుండేలా చేయాలి.
పార్టీలు - రూమ్ లో రాత్రివేళ పార్టీల వంటి వాటికి కొంత సమయం కేటాయించాలి. ఆ సమయానికి అందరూ వీలైనంతవరకు లైట్లు తీసి బెడ్ చేరేలా చూసుకోవాలి. రూమ్ లోని వారు ప్రతిరోజూ ఉదయం వేళ వారి వారి సమయాలకు వెళ్ళి పనులవంటివి చేసుకోవాలని గుర్తించాలి. మీ లేట్ నైట్ పార్టీలు వారికి అసౌకర్యం కలిగించరాదు.
కామన్ పనులు - అందరికి అందుబాటులో వుండే విధంగా ఒక నోటీస్ బోర్డు వంటిది లివింగ్ రూమ్ లో వుంచి ప్రతినెలా ఎవరెవరూ ఏమేమి పనులు చేయవలసి వుంటుందో వ్రాయండి. వాటి ఎదురుగా ఎవరు ఏ పనులు చేయాలో నిర్ణయించండి. ముందస్తుగానే ఇటువంటి నిర్ణయాలు చేస్తే అన్ని పనులు ఒకరే చేస్తున్నామనే భావన వుండదు.
బిల్లులు - కరెంటు లేదా వాటర్ బిల్లుల వంటివి రొటేషన్ ప్రకారం లేదా ఎవరికి సౌకర్యంగా వుంటే వారు చెల్లించి అవి డిస్కనెట్ల్ కాకుండా చూసుకోవాలి. ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే, వారి స్ధానంలో వేరే వారు వాటిని చెల్లించి వారికి సౌకర్యం చేయాలి.
ప్రశంసలు - ప్రతి వారిలోను మంచి గుణాలు ఎన్నో వుంటాయి. మీ రూమ్మేట్ మంచి వాడైతే, ప్రతిరోజూ పెందలకడే లేచి కొన్ని పనులు చేస్తుంటే అతడిని ప్రశంసించండి. ఒక నోట్ బుక్ వంటిది పెట్టి మీ రూమ్ లో వుండే వారి మంచి గుణాలు, చెడు గుణాలు రికార్డు చేయండి.మన అవసరాలకు నగరంలో వుంటున్నపుడు ప్రత్యేకించి ఎంతో సొమ్ము వెచ్చించి ఒక్కరికి సరిపడా ఇంటిని అద్దెకు తీసుకోలేము. అందుకుగాను నలుగురు లేదా అయిదుగురు కలసి తీసుకోవలసి వస్తుంది. ఆ అద్దె సొమ్మును నిర్దేశిత తీదీకి అందరూ జమ చేసి ఓనరుకు అప్పగించే భాధ్యత ఒకరు చేపట్టాలి.
అందరూ కలసి మెలసి కలహాలు లేకుండా వుంటే ఎంత కాలం వున్నప్పటికి అందరికి ఆనందంగానే వుంటుంది.



Click it and Unblock the Notifications
