Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ప్రేమ కోరకు భర్తలు అబధ్ధాలు చెపుతారా?

మరి తమ ప్రేమను రుజువు పరచుకోటానికి భర్తలు ఎందుకు అబద్ధాలు చెపుతారు?
అబద్ధం చెప్పటం అలవాటు - అబద్ధం చెపటం చెడు కాదనేది పురుషుల అభిప్రాయం అందుకని చెప్పేస్తారు. కొంతమంది పురుషులు పుటుకతోనే అబద్ధాలకోరు అని పేరు తెచ్చుకుంటారు. ఏవో కొద్ది మాయమాటలు చెప్పేసి మరీ మిమ్మల్ని నమ్మించి ఆనందిస్తారు. అబద్ధం చెప్పేందుకు పురుషులు ఏ మాత్రం వెనుకాడరు. వారి ఉద్యోగం లేదా వివాహ జీవితం ఏదైనప్పటికి పురుషులు షార్ట్ కట్ రూట్ లో వెళ్ళటానికి చూస్తారు.
మహిళలు అర్ధం చేసుకోలేరు - ఈ అంశాన్ని చాలామంది పురుషులు భావిస్తూంటారు. లేట్ ఎందుకైంది అని అడిగితే, పని ఒత్తిడి లేదా ట్రాఫిక్ లో వుండిపోయాను వంటిఅబద్ధాలు చెప్పి అసలు విషయంగా ఎక్కడో తిరిగేస్తూంటారు. పురుషులకు క్రీడల పట్ల ఆసక్తి. మరి అటువంటి వాటికి వెళ్ళి, కూడా అసలు విషయం చెప్పరు. ఏదో మాయ మాటలు చెప్పి దాటవేస్తారు.అబద్ధం చెప్పి పబ్బం గడుపుకుంటారు.
మహిళలు వాస్తవం గ్రహించలేరు - మహిళలు వాస్తవాలను అర్ధం చేసుకోలేరని అనుకుంటే అది సరికాదు. చాలామంది పురుషులు తమ పార్టనర్ వద్ద అబద్ధం చెప్పేసి క్షమించమంటారు. నిజాన్ని ఒప్పుకోవటంలో విఫలమవుతారు. తమను ప్రేమిస్తున్న కారణంగా తమ పార్టనర్లకు నిజాలు చెప్పి తిట్లు తినలేమని వీరంటారు. కాని మీరు మీ భార్యను మోసగిస్తూంటే, ఇక అందులో ప్రేమ ఏముంటుంది? కనుక, అబద్ధాలు చెప్పే భర్తలతో భార్యలు మోసపోరాదు. భర్త చెప్పే దానిలో అబద్ధాలను పసిగట్టాలి. వాస్తవాలను గ్రహించాలి.
ఆశలను నిరూపించుకునేందుకు పురుషులు అబద్ధాలు చెపుతారు - మహిళలు భర్తలనుండి ఎన్నో ఆశిస్తారు. వారు షాపింగ్ కు తమతో రావాలని, వారి అందాలను మెచ్చుకోవాలిఅని, వారు చేసే పనులు బాగున్నాయని అనాలని ఆశిస్తారు. కాని, ఏ పురుషుడూ కూడా ఇవన్నీచేయలేడు. కనుక, పురుషులు మోసం చేస్తూనే అన్ని మహిళలకు చేశామంటారు. తాము ఆ విధంగా తమ ప్రేమను చాటుకోవాలని చూస్తారు.
తాము కరెక్ట్ అని రుజువు చేసుకునేందుకు - అబద్ధాలు చెప్పే పురుషులంటే... మహిళలు జాగ్రత్తగానే వుంటారు.కాని పురుషులు అన్ని విషయాలలోను అంటే తమ ఉద్యోగం కాని, లేదా జీవితంకాని, మరొకటి కాని, తాము చెప్పిందే సరైనది, తాము చేసిందే సరైనది అంటూ రుజువు చేసుకోవటానికి కూడా అబద్ధాలు చెప్పేస్తారు. వారికి అనుకూలమైనట్లు పరిస్ధితిని మార్చుకుంటారు. ఏది ఏమైనప్పటికి పురుషులు వారి ప్రేమను మీ పట్ల రుజువు చేసుకోటానికి, మీ ముఖాలలో ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పేస్తారని మహిళలు గ్రహించాలి.



Click it and Unblock the Notifications
