Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
ఏభై ఏళ్ళ వయసు ప్రేమలో మీకు నమ్మకం వుందా?

ఏభై ఏళ్ళకు రొమాన్సా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా?ఏభై ఏళ్ళ వయసులో కూడా ప్రేమ రోమాన్స్ లపై మండే మీ కోర్కెలు కొనసాగించేందుకు కొన్ని చిట్కాలు చూడండి. మీ మధ్య గల ప్రేమ మరోమారు ఎలా ఎగిసిపడుతుందో చూడండి.
ధైర్య సాహసాలు ప్రదర్శించండి - ఎంత ముసలివారైనా మంచి లక్షణాలు కల జంటిల్మన్ అయితే చొరవ ఎపుడూ మాయమవదు. మీ మహిళను ఒక యువరాణిగా భావించండి. మొదటి సారి కలిసినపుడు మీరు ఆమెతో ఎలా వున్నారో అదేవిధంగా భావించండి. ఆనాడు మీరు ఆమెకు చేసిన చిన్న చిన్న చేష్టలు మరోమారు చేస్తూ ఆనందించేయండి.
డేటింగ్ చేయండి - మీ మొదటి డేటింగ్ గుర్తుందా? మీ ప్రేమ జీవితం బాగా సాగాలంటే, మీ మొదటి డేటింగ్ తేదీ గుర్తుపెట్టుకోవడం అవసరం. ఒక హోటల్ లేదా రెస్టరెంట్ లో ఆమెకు మంచి విందునిచ్చేయండి. ఆమెకు ఇష్టమైన అన్ని వంటకాలు, నార్త్ లేదా సౌత్ ఇండియన్ డిషెస్ వంటివి రుచిచూపించండి. కేండిల్ లైట్ డిన్నర్ అనేది మరచిపోకండి.
మంచి వాతావరణం ఏర్పరచండి - ప్రేమకు, రొమాన్స్ కు కావలసిన రీతిలో మీ ఇంట్లోనే మంచి వాతావరణం ఏర్పరచండి. ఇద్దరికి ఇష్టమైన వంటకాలు చేయండి. డిమ్ లైట్లు మ్యూజిక్ వంటివి రొమానన్స్ కు అనుకూలం. మహిళలు కోర్కె కలిగించే నలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు వేయాలి. జుట్టు అలంకరణ, సువాసనల సెంటు వాడకం వంటివి అతనికి మత్తెక్కిస్తాయి. ఏభై ఏళ్ళ పైన పుట్టే ప్రేమ కూడా హుషారుగానే వుంటుందని గ్రహించండి.
బహుమతులు ఇచ్చుకోండి - మీ పార్టనర్ కు బహుమతులు ఇవ్వండి. పూవులు, లేదా కార్డులు, ఆమెకిష్టమైన ఇతర వస్తువులు బహుమానంగా ఇవ్వండి. ఒకరికొకరు ఇన్ని సంవత్సరాలనుండి చేసుకున్న సేవలకు కృతజ్ఞత ప్రదర్శించుకోండి.
ఒకరికొకరు సమయం వెచ్చించండి - ఏభై సంవత్సరాలంటే పిల్లలు, ఉద్యోగం భాధ్యతలతో వుంటారు. కాని ఇవన్ని వున్నప్పటికి ఇద్దరూ కొంత సమయం మీదిగా భావించండి. వారాంతంలో ఒక సినిమా చూడండి. లేదా ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్ళండి. ఉదయం, సాయంత్రం వాకింగ్ వంటివాటికైనా సరే కలసి వెళ్ళండి. ఆనందించండి.
ప్రేమ అనేది ఎప్పటికి మరణం లేనిది. ఏభై ఏళ్ళు పై బడ్డా ప్రేమ, రొమాన్స్ వంటివి సాధారణమే.



Click it and Unblock the Notifications
