Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
హై స్కూల్ డేటింగ్ అద్భుత జీవితం...!

హై స్కూల్ లోనే డేటింగ్ మొదలుపెట్టేవారు చాలామంది జంటలున్నారు. పెళ్ళి అయ్యే సరికి అది ముగిసిపోతుంది. కాని ఈ టేనేజ్ ప్రేమకధలు అన్నీ ఆనందంగా ముగియవు. విషాదాలుంటాయి. విడిపోవటాలుంటాయి. చేదైన అనుభవాలు, చికాకు, విచారాలు కలిగించే పెద్దలు. కొన్ని విషయాలలో ఈ వయసు పిల్లలు తమ తోటి వయసు వారిపై ప్రతీకారం కొరకైనా సరే డేటింగ్ లు ఆనందించేస్తారు.
మరి హైస్కూల్ జీవితంలోనే డేటింగ్ సాఫీగా సాగిపోవాలంటే, ఆనందకరమైన అనుభవాలు పొందాలంటే, మంచి సంబంధాలకై కొన్ని చిట్కాలు పరిశీలించండి.
1. మీ వ్యక్తిత్వం నిలుపుకోండి - చాలామంది టీనేజ్ పిల్లలు తమ పార్టనర్లను సంతోషపెట్టటానికిగాను తమ వ్యక్తిత్వాలను చంపుకుని మారిపోతారు. స్వచ్చందంగా లేదా కొన్ని సార్లు వారి గొప్పలను కీర్తించినపుడు అలా మారిపోతారు. వ్యక్తిత్వాలు కోల్పోయి ఆనందిస్తారు. కాని మీ పార్టనర్ మిమ్మల్ని ఎలా చూసి అభిమానించాడో అదే విధంగా మీరుండాలి. మీరు మారాల్సిన అవసరం లేదని గుర్తించండి.
2. స్నేహితులను, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయకండి - టీనేజ్ ప్రేమ తన ప్రేమికుడిని లేదా ప్రేయసిని మాత్రమే లెక్కబెట్టి స్నేహితులు, కుటుంబం అందరిని దూరం చేస్తుంది. కనుక. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా కొంత సమయం కేటాయించండి. వారి అభిప్రాయాలు తెలుసుకోండి.
3. అనైతిక పనులు చేయకండి - డేటింగ్ మొదలు పెడితే, ముందుగా టీనేజ్ పిల్లలు అబద్ధాలు చెపుతారు. స్నేహితులకు తాము ఎక్కడ వున్నారు, ఎవరితో వున్నారు వంటివి నిజాలు తెలుపరు. తల్లితండ్రులకు కూడా ఇదే రకమైన అబద్ధాలు చెపుతారు. వీలైనంతవరకు, నిజాయతీగా మీ సంబంధంలో వుండండి. ఆ రకమైన ప్రవర్తన మీకు తక్కువ సమస్యలు కలిగిస్తుంది.
4. మీ కెరీర్ అశ్రద్ధ చేయకండి - ప్రేమ అనేది సొమ్మును సంపాదిస్తుందని భావించకండి. అది ఉద్యోగం కూడా ఇవ్వదు. కనుక స్టడీ అశ్రద్ధ పరచకండి. లేదా మీకు మంచి సంబంధం పెద్దలు చూస్తే కాదనకండి. మిమ్మల్ని ప్రేమించే అతనికి లేదా ఆమెకు సైతం అటువంటి అవకాశాలు కావాలని భావించండి.
5. శారీరక సంబంధం - సరిగ్గా ఈ వయసులోనే టీనేజ్ పిల్లలు తమ శరీరంలోని అవయవాలను పరిశోధిస్తారు. పది లేదా పదకొండు సంవత్సరాల వయసులో తెలియని ఆరాటం వీరిలో చోటు చేసుకుంటుంది. 18 సంవత్సరాలవరకు ఆగాలని తెలిపినప్పటికి, నేడు హైస్కూల్ దశలోనే శారీరక సంబంధాలకు తలపడుతున్నారు. అటువంటి పనులకు వారే భాద్యులని వారు గ్రహించాలి. తర్వాత వచ్చే ఫలితాలకు అనుభవించాలి. కనుక వారికి పెద్దలు, ముందు జాగ్రత్తలు, కొన్ని నేర్పించాలి. టీనేజ్ ప్రేమలు వద్దు అన్నా వచ్చేస్తాయి. ఆచరించదగినవే అయితే అవి భాధ్యతారాహిత్యంతో వుండరాదనేది గ్రహించాలి.
టీనేజర్లుగా డేటింగ్ అంశాలలో పట్టుబడిపోతూనే వుంటారు. కాని మీ ముందు ఎంతో భవిష్యత్తు ఉందనేది గుర్తించండి. చెడు సంబంధం అనుకుంటే వదిలేయండి. అది మీకు మంచి జీవితాన్నిస్తుంది. ఆనందం ఎంతో భవిష్యత్తులో వుందని గుర్తించండి. సంబంధాలకు దిగేముందు జాగ్రత్త వహిస్తే, వాస్తవానికి జీవితంలో హైస్కూల్ వయసు ఎంతో మంచిది.



Click it and Unblock the Notifications
