Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
తండ్రి - కొడుకుల వైరం ముగించటం ఎలా?

అసలు తండ్రి కొడుకుల మధ్య వైరం ఎందుకు వస్తుంది?
1. ఇది ఒక విభిన్నమైన వైరం అని ఇది వాస్తవమైనదని ఒప్పుకోవాలి. దీనిలో అసూయ, పగలకు తావులేదు. చాలావరకు ఇది నిరాశ లేదా ఆశించిన స్ధాయికి ఎదగటానికి అశక్తత అన్న భావన తండ్రి కొడుకుల మధ్య వైరం తెస్తుంది.
2. తండ్రి ఎపుడూ కొడుకు తనవలే వుండాలని కోరుకుంటాడు. తండ్రి కనుక గొప్పవాడు కాలేకుంటే, తాను కావాలనుకున్న గొప్పతనం తన కొడుకుకి వుండాలని భావిస్తాడు. మరి కొడుకు కొన్ని సార్లు తండ్రి ఆశయాలకు వ్యతిరేకిస్తాడు. కొడుకు మీద వుండే ఒత్తిడి తండ్రికి వ్యతిరేకంగా పోయేలా చేస్తుంది.
3. తమ తండ్రులు గొప్పవారైనపుడు వారి కొడుకులు తండ్రి నీడలో అతని పేరు ప్రతిష్టలలో కొట్టుమిట్టాడుతూంటారు. ఇది చాలావరకు సెలిబ్రిటీ పిల్లలకు వర్తిస్తుంది. వారు తండ్రులంత గొప్పవారు కాలేరు. ప్రపంచమంతా తండ్రి ప్రమాణాలతో కొడుకులను పోల్చి వారిని తగ్గిస్తుంది.
4. ఏ ఇద్దరు వ్యక్తులు, తండ్రి లేదా కొడుకు అయినప్పటికి ఒకటిగానే వుండలేరు. అనేది తండ్రులు తెలుసుకోవాలి. తాము కొడుకులుగా వున్నప్పటి పరిస్ధితులు గుర్తుకు తెచ్చుకోవాలి.
5. చాలా కుటుంబాలలో తండ్రి క్రమశిక్షణలో పాత్ర వహిస్తాడు. కఠినమైన ఈ పాత్ర అతడిని కొడుకుతో మంచి సంబంధానికి ప్రోత్సహించదు.
ఈ అంశాలన్ని తండ్రి కొడుకుల సంబంధాన్ని క్లిష్టంగా మార్చేస్తాయి. అయితే, వీరు ఈ పరిస్ధితిని మార్పు చేసుకోవాలి. అందుకుగాను క్రింది చర్యలు చేపట్టాలి.
తండ్రి కొడుకుల వైరం ఎలా పరిష్కరించాలి?
1. మీ తండ్రి చేసే వృత్తి కాకుండా వేరేదిగా ఎంచుకోండి. అపుడు దానిలో మీకు ఆకాశమే హద్దుగా వుండి నక్షత్రంవలే ప్రకాశిస్తారు. తండ్రి వృత్తి మీరు ఎంచుకుంటే, ఎల్లపుడూ పోలిక చేస్తారు.
2. ఒక తండ్రిగా మీరు కొడుకు వ్యక్తి అనేది గుర్తించాలి. అతని కలలు, సామర్ధ్యాలు, గుణాలు మీనుండి విభిన్నంగా వుంటాయని తెలుసుకోవాలి. అతని కలలు గొప్పవా, తక్కువవా అనేది నిర్ణయించేందుకు ప్రయత్నించకండి.
3. మీ తండ్రి మీకు ఎప్పటికి శత్రువుకాదు. అతను చెప్పినది మీకు ఇష్టం లేనప్పటికి, అతను మీ మంచికే చెపుతున్నాడని గ్రహించండి. అతనితో మీరు అంగీకరించాల్సిన పనిలేదు. అయితే, మీరు ఒప్పుకోవడం లేదా ఒప్పుకోకపోవడం అనేది గౌరవంగా చేయాలి.
4. అంగీకరించటం అనేది తండ్రి, మరియు కొడుకు ఇద్దరికి నేర్చుకోవలసిన విషయమే. ఇద్దరికి మానవ బలహీనతలు, విఫలతలు వుంటాయి. ఒకరినొకరు అంగీకరించటం, క్షమించేయటం అనేది అవసరం. వైరం కల సంబంధం ముగించేందుకు అంగీకరించేయడం ప్రధానం.



Click it and Unblock the Notifications
