Latest Updates
-
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
గతంలోని నలభై సంవత్సరాల వయసు ఇప్పటి 20లకు సమానమా?

తనకు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి కరణ్ జోహార్ అందరికి విందు ఇచ్చేశాడు. బొమన్ ఇరాని మరియు ఫరా ఖాన్ వంటి నటులు 40 సంవత్సరాల వయసుపై తాము తీసిన చిత్రాలను రిలీజ్ చేశారు. ఇదే వయసులో అంటే 42 సంవత్సరాలకు విశ్వనాధన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ప్రపంచ సూపర్ మోడల్ ఎల్లీ మేక్ పర్సన్ తనకు వయసు వచ్చినా బెంగలేదు పో... అంది. ఏమిటిది నలభైలు వచ్చినా వీరంతా ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు? కొత్తగా వచ్చే ఇరవై ఏళ్ళ వయసు వారి మాదిరిగానే !
కరణ్ జోహార్ వంటివారు నలభైలలో బర్త్ డే అంటూ పార్టీలు ఇచ్చి ఎంతో ప్రచారం పొందారు. తమ వయసును తాము లెక్కించటంలేదంటున్నారు. మరి 40 లలో కూడా ప్రేమ కధలే! బొమన్ ఇరాని మరియు ఫరా ఖాన్ లు తమ ఫిల్ము లో అసాధరణమైన ప్రేమ కధను చూపి అందరిని అబ్బుర పరచారు. అందులో ఫరా 40 ఏళ్ళ వయసుకల పార్శి బ్రహ్మచారిణి పాత్ర పోషించి అందరిని సంతోష పెట్టింది. మన ప్రేక్షకులు సైతం నలభై సంవత్సరాల వ్యక్తుల ప్రేమ కధలకే ప్రాధాన్యమిస్తున్నారు.
చెస్ ఆట గెలుపులలో వయసుతో పని లేదంటాడు విశ్వనాధన్ ఆనంద్. చిన్నవారుగా వున్నపుడు చెస్ లో అనేక ఆలోచనలుంటాయి. అనేక సార్లు గెలిచిన 40 సంవత్సరాల వయసులో అంతా పరిపక్వతే. దేశం యావత్తూ అతని గెలుపును ఎంతో గొప్పగా అభినందించింది. అది 40 లలోని గొప్పతనమే.
40 సంవత్సరాల వయసులోనే మరింత సెక్సీ. హారిబుల్ బాసెస్ హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టాన్ అందరూ మెచ్చే సెక్సిణిగా కీర్తించబడింది. పదో స్ధానాంలో వచ్చిన ఎంజెలినా జోలీని కూడా మరపింపజేసింది. 40 లలో కూడా మహిళ ఎంత సెక్సీగానో వుండవచ్చనేది అందరికి విప్పి చెప్పింది. ఆమె దుస్తులు, తల వెంట్రుకల స్టైల్ అన్ని అద్భుతం. చిన్నగా ఎలా వుండాలనేది ఆమెకే తెలుసు. తనకంటే చిన్న నటీమణులను కూడా ఆమె మరపింపజేసింది.
వయసెంతైనా పరవాలేదు. నలభైల చివరలో వున్న సూపర్ మోడల్ ఎల్లీ మేక్ ఫెర్సన్ తన వయసు గురించి ఏమాత్రం ఆందోళన చెందదు. యువతరమే అందానికి ప్రతీక కాదు అంటుంది ఈమె. నన్నుచూడు ఎంత అందంగా వున్నానో అంటుంది. ఏభైలు వస్తున్నా నాకేం ఢోకాలేదు అంటుంది. నాకింగా 50 సంవత్సరాల అనుభవం జీవితంలో వుంటుంది అంటోంది ఈమె.
ఇక చివరగా వేడి వేడి వ్యక్తి, జేమ్స్ బాండ్ పాత్రధారి డేనియల్ క్రెయిగ్ ఇటీవలే బెస్ట్ డ్రెస్ డ్ ఆన్ స్క్రీన్ యాక్టర్ గా అవార్డు పొందాడు. అతను 40 సంవత్సరాల వయసు పొందినప్పటికి అతని అభిమానులు అతనికి బ్రహ్మ రధం పడుతూనే వున్నారు.



Click it and Unblock the Notifications
