Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
మీ గాళ్ ఫ్రెండ్ మిమ్మల్ని తన స్వార్ధానికి వాడుకుంటోందా?

మీ గాళ్ ఫ్రెండ్ అందాల రూపం మిమ్మల్నే కాదు, మీ ఫ్రెండ్స్ ని సైతం పిచ్చెక్కించేస్తుంది. వారిని మాట్లాడకుండా చేసేస్తుంది. లైనేయటం ప్రధానంగా....ప్రొసీడ్ మిత్రమా అనేస్తారు. ఎందుకంటే....ఇంత అందంగా, మత్తుగా వుండే ఈ యువతులు వారిస్వంత అవసరాలకు స్వార్ధాలకు యువకులను ఆకర్షించేస్తారు. మీ పార్టనర్ మిమ్మల్ని ఎడా పెడా వాడేసుకోవటానికిచూస్తోందంటే, మీకు జీవితంలో అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదనిపిస్తుంది. మరి దారుణమైన ఈ మీ గాళ్ ఫ్రెండ్ చర్యలను అరికట్టాలంటే, ఎలా? అసలు ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తోందని తెలుసుకోవాలంటే...ఎలా? అందుకు కొన్ని చిట్కాలు చూడండి.
ఆమె మీకు సమయం ఇస్తోందా? ఆమె మిమ్మల్ని ప్రేమించేదైతే, ఎప్పుడూ కూడా మీకు కొంత సమయం కేటాయిస్తుంది. ఆమె కలవకపోవటానికి సరైన కారణం వుండి, సాయంత్రాలు కలవకపోతే, బహుశ మీరు దీనని ఆమోదించవచ్చు. అయితే, ఆమె కనుక మీతో సమయం కేటాయించకుండా లేదా ఒక వాస్తవ ప్రేమికురాలిగా మీ ముఖం చూడకుండా వుంటే, ఆమె మిమ్మల్ని ప్రేమిస్తోందా అనేది మీరు మరోసారి ఆలోచించాలి. ఒక వాస్తవ ప్రేమికురాలు ప్రతిరోజూ మిమ్మల్ని కలవాలని తహ తహ లాడుతుంది. మిమ్మల్ని కలవాలనే కాంక్ష ఆమె కళ్ళలో కనపడుతుంది.
ఆమె మీకు మనసిస్తోందా? మీ గాల్ ఫ్రెండ్ మీకు అసలు మనసిచ్చిందా లేదా? అనేది మీరు పరిశీలించాలి. ఆమెకు ఒక పరీక్ష పెట్టండి. ఆమెకుమీ గురించి ఏం తెలుసో పరీక్షించండి. డేటింగ్ లో ఆసక్తి వుంటే ఆమె మీ గురించి తెలుసుకోవటానికి సిద్ధమవుతుంది. తెలుసుకుంటుంది. మీ ఇష్టాలు, మీకు నచ్చిన ఆహారం, మీరుమెచ్చే సినీ నటుడు, మొదలైనవి. ఇవి మీరు గతంలో చర్చించుకునివుంటే, మరోమారు ప్రశ్నించుకోండి. మీ గాళ్ ఫ్రెండ్ అవన్ని గుర్తుంచుకుందో లేదో సరిచూడండి.
ఆమె మిమ్మల్ని చూడంగానే...ఆనందంగా, సిగ్గు పడి ఎరుపెక్కే ముఖంతో వుందా? ఒక యువతి తన పురుషుడిని చూడగానే, ఆవేశ పడుతుంది. డేట్ ఇస్తే, ఆమె స్పందన గమనించండి. ఆమె కనుక ప్రేమిస్తే, వెంటనే సిగ్గుపడుతుంది. మీ ముఖం చూస్తే, సిగ్గుపడుతుంది. సిగ్గుపడే ఆమె చిరునవ్వు, ఆమె మిమ్మల్ని వాడుకోవటం కాదని, ప్రేమిస్తోందని తెలియజేస్తుంది.
ఖర్చు తక్కువ చేయండి - గాళ్ ఫ్రెండ్ మిమ్మల్ని వాడుకుంటోందా అనేది పరిశీలించాలంటే, ఆమెకు తక్కువ ఖర్చు పెట్టండి. షాపింగ్ కు వెళదాం డార్లింగ్ అంటూ కోరితే, ఒకటి రెండు సార్లు తిరస్కరించండి. మరోమారు ఆమెతో వెళ్ళండి కాని వెనుక వుండి సొమ్ము చెల్లించకండి. డబ్బు తక్కువుంది డార్లింగ్, పర్స్ తేలేదు అని చెవిలో మెల్లగా చెప్పండి. ఆమె బాగా వుంటే, సరే. లేక మీ పై కోపం ప్రదర్శించి చికాకు పడితే, ప్రేమ తక్కువే.
ఈ చిన్నపాటి పరీక్షల ద్వారా మీ గాళ్ ఫ్రెండ్ మిమ్మల్ని తన అవసరాలకు వాడుకుంటోందా? లేక తాను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తోందా? అనేది తెలుసుకోవడానికి పనికి వస్తాయి. మరో రకంగా కొంతమంది తమ శారీరక అవసరాలకు కూడా వాడుకునే వారుంటారు. వారి విషయంలో కొన్నాళ్ళు ఆమె పిలిచినా వెళ్ళక దూరం అవండి. అపుడు ఆమె నిజస్వరూపం తెలుస్తుంది. అపుడు మీరు తెలివితేటలతో ఆమె ఉచ్చునుండి బయటపడండి.



Click it and Unblock the Notifications
